కవి.. గేయ రచయిత క్యాన్సర్‏తో పోరాటం.. కందికొండను కాపాడుకుందాం..

కంది కొండ! సినిమా పాటకు తెలంగాణ యాసను అద్దిన కవుల్లో ఆయన కూడా ఒకరు. బతుకమ్మ పాటను బాహ్య ప్రపంచంలోకి

కవి.. గేయ రచయిత క్యాన్సర్‏తో పోరాటం.. కందికొండను కాపాడుకుందాం..
Kandikonda
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 27, 2021 | 10:28 AM

కంది కొండ! సినిమా పాటకు తెలంగాణ యాసను అద్దిన కవుల్లో ఆయన కూడా ఒకరు. బతుకమ్మ పాటను బాహ్య ప్రపంచంలోకి తీసుకెళ్లిన రచయితల్లో ఆయన కూడా ఒకరు. ఆయనే కవి, సినీ గేయ రచయిత కందికొండ. సినీ గేయ రచయితగా ఎన్నో విజయవంతమైన పాటలు రాసిన కందికొండ ప్రస్తుతం కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. క్యాన్సర్‌ మహమ్మారి నుంచి రెండేళ్లుగా అలుపు సొలుపు లేకుండా పోరాడిన కందికొండ .. ఆ మహమ్మారి నుంచైతే బయటపడ్డారు. కానీ పూర్తి ఆరోగ్యంగా మళ్లీ మన ముందుకు వచ్చేందుకు ఇంకా గట్టి ప్రయత్నమే చేస్తున్నారు.

కంది కొండ ప్రస్తుతం పెరాలసిస్ తో బాధపడుతున్నారు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఎక్కువ కాలం కీమో థెరపీ చేయించుకోవడంతో.. కందికొండ స్పైనల్‌కార్డ్‌ లోని సీ1 సీ2 భాగాలు దెబ్బతిన్నాయి. దీంతో కందికొండ నడవలేని స్థితిలోకి వెళ్లిపోయారు. తొందరగా ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదమని కందికొండను పరీక్షించిన డాక్టర్లు చెబుతున్నారు.

అయితే ఇప్పటికే క్యాన్సర్‌ చికిత్స కోసం దాదాపు 26 లక్షల వరుకు ఖర్చు పెట్టిన కందికొండ.. ఆ తరువాత ప్రభుత్వం అందించిన 5 లక్షల సాయంతో ప్రస్తుతం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. అయితే తాజాగా కాళ్లు చేతులు తిమ్మిర్లు ఎక్కుతున్నాయనే కారణంతో కందికొండను పరీక్షించిన డాక్టర్లు అత్యవసరంగా స్పైనల్‌ కార్డ్‌కు చికిత్స చేయాలని చెప్పారు. దీంతో ఆపనప్న హస్తం కోసం ఈ రచయిత ఎదురు చేస్తున్నారు. తోచిన కాడికి డబ్బు సాయం చేయమని అందరిని అభ్యర్థిస్తున్నారు.

Also Read: చరణ్-శంకర్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. చెర్రీతో తలపడనున్న విలన్ ఎవరంటే..

Samantha: మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారోనని కంగారు పడకండి.. ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత..

Megastar Chiranjeevi: కృష్ణవంశీ సినిమా కోసం చిరంజీవి.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్.. 

Prabhas: పూరీ జగన్నాథ్ తనయుడిపై ప్రభాస్ సీరియస్.. పిచ్చోడిలా కనిపిస్తున్నానా అంటూ..