చరణ్-శంకర్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. చెర్రీతో తలపడనున్న విలన్ ఎవరంటే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే

చరణ్-శంకర్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. చెర్రీతో తలపడనున్న విలన్ ఎవరంటే..
Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 27, 2021 | 9:44 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్ట్‏ను పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు.. ప్రస్తుతం ఈ పుణెలో షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్…చరణ్ కాంబోలో రాబోతున్న ఈసినిమా పై ఇప్పటికే భారీగానే అంచనాలను క్రియేట్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని భారీ బడ్డె్ట్‏తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇటీవల ఈ మూవీలోని పాటను దాదాపు 12 రోజులపాటు షూట్ చేయబోతున్నట్లుగా టాక్ వినిపించింది. అంతేకాదు.. ఒక్క పాటకు కోట్లలో బడ్జెట్ కేటాయించడానికి దిల్ రాజు సైతం సుముఖత వ్యక్తం చేశారట. భారీ బడ్జెట్‏తో తెరకెక్కించే పాటలో విజువల్స్ అద్భుతంగా ఉండనున్నాయని టాక్.. ఇదిలా ఉంటే.. ఈ మూవీ నుంచి మరో ఆసక్తికర అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో హల్చల్ చేస్తోంది. చరణ్, శంకర్ కాంబోలో రాబోతున్న సినిమాలో విలన్ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందట. చరణ్‏తో తలపడేందుకు మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి అయితే సరిగ్గా సెట్ అవుతాడని భావించిన శంకర్ ఆయనను ఎంపిక చేసినట్లుగా టాక్. మలయాళంలో పోలీస్ పాత్రలకు సురేష్ గోపి పెట్టింది పేరు. మలయాళంలో ఆయన చేసిన చిత్రాలు తెలుగులో డబ్ అయి సూపర్ హిట్ అందుకున్నాయి. దీంతో తెలుగు ప్రేక్షకులకు సురేష్ గోపి సుపరిచితమే. ఇక చరణ్‏కు ప్రతినాయకుడిగా సురేష్ గోపి నటించనున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారట. అంతేకాదు.. సురేష్ గోపి భార్యగా ఇషాగుప్తా నటించనున్నారని.. ఆమెది పూర్తిగా నెగిటివ్ పాత్ర అని టాక్. ఈ సినిమాలో కీలక పాత్రలలో శ్రీకాంత్ సునీల్, అంజలి నటిస్తున్నారు..

Also Read: Samantha: మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారోనని కంగారు పడకండి.. ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత..

Megastar Chiranjeevi: కృష్ణవంశీ సినిమా కోసం చిరంజీవి.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..