Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: కృష్ణవంశీ సినిమా కోసం చిరంజీవి.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్.. ‏

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా పూర్తిచేశారు.. ఇందులో కాజల్ హీరోయిన్‏గా నటిస్తుండగా..

Megastar Chiranjeevi: కృష్ణవంశీ సినిమా కోసం చిరంజీవి.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్.. ‏
Chiranjeevi
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 27, 2021 | 8:42 AM

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా పూర్తిచేశారు.. ఇందులో కాజల్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ తర్వాత చిరు ప్రస్తుతం గాడ్ ఫాదర్.. భోళా శంకర్ సినిమాలు చేస్తున్నారు.. ఇదిలా ఉంటే… తాజాగా చిరంజీవి.. డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాకు సాయంగా నిలిచారు… ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న సినిమా రంగమార్తాండ. మరాఠిలో సూపర్ హిట్ గా నిలిచిన నటసామ్రాట్ చిత్రానికి తెలుగు రీమేక్‏గా రంగమార్తాండ రూపొందిస్తున్నారు.. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాలో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

అయితే ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చినట్లుగా డైరెక్టర్ కృష్ణవంశీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో.. అడగ్గానే ఒప్పుకుని.. మరేమి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా మా సినిమాకు వాయిస్ ఓవర్ చెప్పినందుకు థ్యాంక్యూ అన్నయ్య అంటూ చిరుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇందులోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా.. మెగా వాయిస్ రంగమార్తాండ వినీలాకాశంలో మరో వెలుగు దివ్వె అని అభివర్ణించారు. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే రాహుల్ సిప్లిగంజ్.. అనసూయ, శివాత్మిక ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్వీట్..

Also Read: Prabhas: పూరీ జగన్నాథ్ తనయుడిపై ప్రభాస్ సీరియస్.. పిచ్చోడిలా కనిపిస్తున్నానా అంటూ..

Bigg Boss 5 Telugu: గేమ్ షూరు చేసిన షణ్ముఖ్.. ఎట్టకేలకు విజయం సాధించాడు..

Adipurush: సైలెంట్‌గా షూటింగ్‌ పూర్తి చేస్తోన్న ప్రభాస్‌.. తుది దశకు చేరుకుంటున్న ఆది పురుష్‌ చిత్రీకరణ..