AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: పూరీ జగన్నాథ్ తనయుడిపై ప్రభాస్ సీరియస్.. పిచ్చోడిలా కనిపిస్తున్నానా అంటూ..

 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా గడిపేస్తున్నాడు.. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంటున్నాడు

Prabhas: పూరీ జగన్నాథ్ తనయుడిపై ప్రభాస్ సీరియస్.. పిచ్చోడిలా కనిపిస్తున్నానా అంటూ..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Oct 27, 2021 | 7:41 AM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా గడిపేస్తున్నాడు.. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంటున్నాడు.. ఇక ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియా చిత్రాలే కావడం విశేషం.. ఇక ప్రభాస్ వ్యక్తిత్వం.. షూటింగ్ సెట్‍లో ప్రభాస్ ఎలా ఉంటాడో ఇప్పటికే పలువురు స్టార్స్ చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ప్రభాస్‏కు కూడా కోపం తెప్పించారు.. దీంతో మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పై ప్రభాస్ సీరియస్ అయ్యాడు. పిచ్చోడిలా కనిపిస్తున్నానా అంటూ ఫైర్ అయ్యారు. ఇంతకీ ప్రభాస్ అంతగా సీరియస్ కావడానికి కారణమేంటీ ? పూరీ తనయుడిపై డార్లింగ్ ఎందుకు ఫైర్ అయ్యారో తెలుసుకుందామా..

మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ ప్రస్తుతం రొమాంటిక్ సినిమా చేస్తున్నాడు. ఇందులో ఢిల్లీ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్‎గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ కూడా విడుదల చేశారు. అయితే పూరీ జగన్నాథ్.. ప్రభాస్ మంచి స్నేహితులు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన బుజ్జిగాడు.. ఏక్ నిరంజన్ సినిమాలు మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. దీంతో అప్పటి నుంచి ప్రభాస్.. పూరీ జగన్నాథ్ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఈ క్రమంలోనే పూరీ తనయుడు ఆకాష్ నటించిన రొమాంటిక్ మూవీ యూనిట్‏ను స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు ప్రభాస్.

ఈ క్రమంలో ప్రభాస్.. ఆకాష్.. కేతికా శర్మపై తనదైన స్టైల్లో పంచులేశారు. ముందుగా సినిమా గురించి కథ గురించి ప్రశ్నించిన ప్రభాస్.. ఆ తర్వాత ఆకాష్ , కేతికాలను ఆటపట్టించారు. ఇక సినిమా గోవాలో షూట్ జరిగిందని తెలుసుకుని… షూటింగ్ గ్యాప్‏లో అక్కడ ఏం చేశారు.. ఎక్కడికి వెళ్లారు అంటూ ప్రశ్నించారు ప్రభాస్. దీంతో షూటింగ్ తర్వాత ఎక్కడికి వెళ్లలేదని చెప్పుకొచ్చారు ఆకాష .. కేతిక. ఇక తర్వాత తిండి గురించి చెప్పు అనగానే.. గోవాలో ఏ రెస్టారెంట్‏లో ఏ ఫుడ్ బాగుంటుందనే విషయాలను వివరించాడు.. దీంతో ప్రభాస్.. డ్రామాలు దొబ్బకండి.. ఇంతకు ముందు అడిగితే ఎక్కడికి వెళ్లలేదు.. షూటింగ్‏కే పరిమితం అయ్యాం.. ఖాళీ లేదు అన్నారుగా.. ఇప్పుడేంటి ఇలా అన్ని చెబుతున్నారు.. పిచ్చోడిలా కనిపిస్తున్నానా అంటూ ఫన్నీగా సీరియస్ అయ్యారు. ఇక పూరీ జగన్నాథ్ సతిమణి అంటే తనకు గౌరవం ఎక్కువ అని చెప్పుకొచ్చారు ప్రభాస్.. అలాగే సినిమా బాగుంటే.. అందరి హీరోల ఫ్యాన్స్ వచ్చి చూస్తారని సూచించాడు. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ స్నేహితుడు అనిల్ పడూరి దర్శకత్వం వహించారు. అలాగే ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు.

Also Read: Manchu Manoj: ఇంతకీ ఆ తెల్ల పిల్ల ఎవరు.? తన రెండో పెళ్లి వార్తలపై స్పందించిన మంచు మనోజ్‌..

Bigg Boss 5 Telugu: గేమ్ షూరు చేసిన షణ్ముఖ్.. ఎట్టకేలకు విజయం సాధించాడు..

Adipurush: సైలెంట్‌గా షూటింగ్‌ పూర్తి చేస్తోన్న ప్రభాస్‌.. తుది దశకు చేరుకుంటున్న ఆది పురుష్‌ చిత్రీకరణ..

Follow Us
ఆ హీరో నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నాడు..
ఆ హీరో నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నాడు..
ఈ సమ్మర్‌లో ట్రెండీ స్మూతీ: సులభంగా తయారు చేసి రోజంతా హైడ్రేట్‌గా
ఈ సమ్మర్‌లో ట్రెండీ స్మూతీ: సులభంగా తయారు చేసి రోజంతా హైడ్రేట్‌గా
సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ.4 లక్షల పరిహారం
సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ.4 లక్షల పరిహారం
ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. మంగళూరు స్పెషల్ చికెన్ సుక్కా రెసిపీ
ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. మంగళూరు స్పెషల్ చికెన్ సుక్కా రెసిపీ
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్
తులసి, మనీ ప్లాంట్ ఒకే చోట పెంచవచ్చా?పండితులు ఏం చెబుతున్నారంటే?
తులసి, మనీ ప్లాంట్ ఒకే చోట పెంచవచ్చా?పండితులు ఏం చెబుతున్నారంటే?
రోడ్ల మీద పర్సులు, నైటీలు అమ్మాను.. కట్ చేస్తే
రోడ్ల మీద పర్సులు, నైటీలు అమ్మాను.. కట్ చేస్తే
మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..
మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!