- Telugu News Photo Gallery World photos Sukmawati soekarnoputri converted in hindu from muslim who is sukmawati sukarno
ఇస్లాంను వదిలి హిందూ మతాన్ని స్వీకరించిన ఇండోనేషియా మహిళ సుక్మావతి ఎవరో తెలుసా ?..
ఇస్లాం మతాన్ని వదిలి హిందూమాతాన్ని స్వీకరించింది.. అసలు ఈ సుక్మావతి ఎవరు ? ఎందుకు తన మతాన్ని వదిలి హిందువుగా మారిందో తెలుసుకుందామా..
Updated on: Oct 27, 2021 | 12:16 PM

సుక్మావతి సుకర్ణోపుత్రి.. ఇండోనేషియా మొదటి అధ్యక్షుడు సుకర్ణో కుమార్తె. ఇండోనేషియాలోని అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం బాలీలో మంగళవారం జరిగిన సుధీ వదని వేడుకలో ఆమే హిందూ మాతాన్ని స్వీకరించారు. మంగళవారం ఆమె 70 పుట్టినరోజు జరుపుకున్నారు.

సుక్మావతి పూర్తి పేరు దయా ముతియార సుక్మావతి సుకర్ణోపుత్రి. మాజీ అధ్యక్షుడు సుకర్ణో మూడవ కుమార్తె. అంతేకాదు.. దేశ 5వ రాష్ట్రపతి మేఘావతి సుకర్ణోపుత్రికి చెల్లెలు. అలాగే ఇండోనేషియా నేషనల్ పార్టీ (PNI) వ్యవస్థాపకురాలు కూడా.

సుక్మావతి కాంజెంగ్ గుస్తీ పాంగేరన్ అదిపతి ఆర్య మంగ్కునెగరా IXని వివాహం చేసుకున్నారు.. కానీ 1984లో తన భర్తతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. బాలిలోని బాలే అగుంగ్ సింగరాజా జిల్లాలోని సుకర్ణో హెరిటేజ్ సెంటర్లో ఆమె హిందూమాతంలోకి మారారు.

CNN ఇండోనేషియ్ నివేదిక ప్రకారం సుక్మావతి ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనక ఆమె దివంగత అమ్మమ్మ ఇడా అయు నయోమన్ రాయ్ ష్రింబెన్ కూడా కారణమని తెలుస్తోంది. మూడు రోజుల క్రితం సుక్మావతి నిర్ణయాన్ని ఆమె న్యాయవాది బహిరంగంగా తెలిపారు. సుక్మావతి కి హిందూ మతం.. సూత్రాలు, సంప్రదాయాల గురించి పూర్తిగా తెలుసునని ఆయన చెప్పారు.

మూడేళ్ల క్రితం సుక్మావతి ఇస్లాం మతాన్ని ఖండించారని ఆరోపణలు వచ్చాయి. 2018లో ఓ ఫ్యాషన్ ఈవెంట్లో సుక్మావతి అందించిన కవితపై పలు ఇస్లామిక్ గ్రూపులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. షరియా చట్టాన్ని, హిజాబ్‌ను విమర్శిస్తూ ముస్లింలను ప్రార్దన చేయమని ఆ కవిత ద్వారా ప్రజలు ఆరోపించారు. 2019లో కూడా తన తండ్రి సుకర్ణోను ప్రవక్త మొహమ్మద్‌తో పోల్చాడని ఆరోపించారు. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో కేసులన్నీ కొట్టివేశారు.





























