AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెగాస్టార్ అభిమానులకు సర్‏ప్రైజ్ ఇచ్చిన మేకర్స్.. భోళా శంకర్ సినిమాపై అసలు క్లారిటీ ఇచ్చేశారుగా..

Megastar Chiranjeevi Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు.. ఒకవైపు షూటింగ్స్‏లో పాల్గోంటూనే

మెగాస్టార్ అభిమానులకు సర్‏ప్రైజ్ ఇచ్చిన మేకర్స్.. భోళా శంకర్ సినిమాపై అసలు క్లారిటీ ఇచ్చేశారుగా..
Bhola Shankar
Rajitha Chanti
|

Updated on: Oct 27, 2021 | 1:27 PM

Share

Megastar Chiranjeevi Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు.. ఒకవైపు షూటింగ్స్‏లో పాల్గోంటూనే మరో వైపు కొత్త ప్రాజెక్ట్స్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. చిరు బర్త్ డే రోజులన తన తదుపరి సినిమా భోళా శంకర్ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. తమిళ మూవీ వేదాళం చిత్రానికి తెలుగు రీమేక్ భోళా శంకర్. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రాలేదు.

తాజాగా ఈరోజు మెగా అభిమానులకు సర్‏ప్రైజ్ ఇచ్చారు భోళా శంకర్ మూవీ మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చి రూమర్స్‏కు చెక్ పెట్టేశారు. వచ్చే నెల నవంబర్ 11న ఉదయం 7.45 నిమిషాలకు ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‏టైన్మెంట్స్ తెలిపింది. అలాగే నవంబర్ 15 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది.

ట్వీట్…

అయితే తమిళంలో అజిత్ చేసిన పాత్రను తెలుగులో చిరంజీవి చేయనున్నరాు.. అలాగే చెల్లెలుగా చేసిన లక్ష్మీ మీనన్ పాత్రను తెలుగులో కీర్తి సురేష్ చేయనున్నారు. ఇక ఇందులో నటించి నటీనటులకకు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్. ఈ చిత్రాని మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇక మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇందులో చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా… మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Bigg Boss 5 Telugu: టాప్ 5లో ఉండే కంటెస్టెంట్స్ వీళ్లే.. కానీ విన్నర్ మాత్రం అతడే అంటోన్న..