AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: టాప్ 5లో ఉండే కంటెస్టెంట్స్ వీళ్లే.. కానీ విన్నర్ మాత్రం అతడే అంటోన్న..

బుల్లితెరపై బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ

Bigg Boss 5 Telugu: టాప్ 5లో ఉండే కంటెస్టెంట్స్ వీళ్లే.. కానీ విన్నర్ మాత్రం అతడే అంటోన్న..
Bigg Boss 5 Telugu
Rajitha Chanti
|

Updated on: Oct 27, 2021 | 12:56 PM

Share

బుల్లితెరపై బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ భాషలలో ఈ షో దూసుకుపోతుంది. ఇప్పటికే తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తిచేసుకుని ఐదో సీజన్ విజయవంతంగా దూసుకుపోతుంది. అయితే గత సీజన్స్‏కు రెస్పాన్స్ అదిరిపోయిన 5వ సీజన్ మాత్రం ప్రేక్షకులను అంతగా నచ్చడం లేదనేది ముందు నుంచి వినిపిస్తున్న వాదన. ఇందుకు కారణం ఈసారి హౌస్‏లో అంతగా ఫేమ్ ఉన్న కంటెస్టెంట్స్ రాకపోవడమే.. అలాగే గత సీజన్లకు భిన్నంగా ఈసారి ఒకేసారి 19 మంది కంటెస్టెంట్లను ఇంట్లోకి పంపించారు నిర్వాహకులు. దీంతో ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేదా అనే సందేహాలు కూడా వ్యకమయ్యాయి.

ఇదిలా ఉంటే.. షో ఆరంభంలో ప్రేక్షకులు అంతగా ఆదరించకపోయిన.. వారాలు గడుస్తున్న కొద్ది ఆట రసవత్తరంగా మారిపోయింది. మొదటి మూడు వారాలు షో చప్పగా సాగిన.. నాలుగో వారం నుంచి కంటెస్టెంట్స్ ఆట తీరులో మార్పు వచ్చింది. అయితే బిగ్ బాస్ ఇంట్లోకి రాకముందు జనాలకు తెలిసిన కంటెస్టెంట్స్ అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు.. యాంకర్ రవి.. యూట్యూబర్ షణ్ముఖ్, సిరి, ప్రియా, సన్నీ, ఉమాదేవి, శ్రీరామ్, మానస్, లోబో, నటరాజ్ మాస్టర్, కాజల్‏లకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉండేది. ఇక లహరి, శ్వేత, హమిదా, సరయు, విశ్వ అంతకు ముందు జనాలకు అంతగా తెలియదు.

అయితే బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పుడు 50 రోజులు పూర్తి చేసుకుంది. అంటే దాదాపు సగం ఆట పూర్తైంది. దీంతో ఒక్కో కంటెస్టెంట్ గురించి పూర్తి క్లారిటీ వచ్చేసింది ప్రేక్షకులకు. అందుకు అనుగుణాంగానే వాళ్ల ఆట తీరు.. ప్రవర్తన చూసి ఓట్లు వేస్తున్నారు. ఇక ఈ సీజన్ విన్నర్ ఎవరవుతారు ? టాప్ 5 లో ఎవరెవరుంటారు ? అనే దానిపై నెట్టింట్లో చర్చలు మొదలయ్యాయి. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈసారి విన్నర్ అయ్యేందుకు సన్నీకి… మానస్ మధ్య గట్టి పోటీ ఉండబోతుందని నెట్టింట్లో టాక్ నడుస్తోంది. వీరిద్దరిలో ఒకరు విన్నర్ కావడం.. మరోకరు రన్నర్ అప్ గా నిలవబోతున్నారంటూ లెక్కలు వేస్తున్నారు నెటిజన్స్. అలాగే టాప్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్‏లో యూట్యూబర్ షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, మానస్, సన్నీ ఉండనున్నట్లుగా నెటిజన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పలు వెబ్ సైట్స్ జరిపిన పోల్స్‏లో వీరు టాప్ 5 కంటెస్టెంట్స్‏గా ఉండబోతున్నట్లుగా వెల్లడైందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. నిన్నటి ఎపిసోడ్‏లో టాప్ 5లో ఎవరు ఉండబోతున్నారనే విషయం ప్రియాంక జోస్యం చెప్పుకొచ్చింది. మానస్.. తను టాప్ 5లో కచ్చితంగా ఉంటామని.. అలాగే ఈ సీజన్ విన్నర్ మానస్ అవుతాడని అంచనా వేసింది. దీంతో మీరే ఉంటే మేమంతా అడుక్కుని తినాలా అంటూ కౌంటర్ వేసింది. దీంతో ప్రియాంక బదులిస్తూ టాప్ 5లో మాతో పాటు మీ ముగ్గురు (సిరి, షణ్ముఖ్, జెస్సీ) కూడా ఉంటారని చెప్పుకొచ్చింది. దీంతో మానస్ ఉంటాడు.. కానీ నువ్వు ఉంటావా లేదా అనే డౌట్ అంటూ పంచ్ వేసింది సిరి. మొత్తానికి బిగ్ బాస్ ఇంట్లోనూ టాప్ 5 చర్చలు నడుస్తున్నాయి.

Also Read:  Viral Photo: నమ్రతతో మాట్లాడుతోన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఈజీగా చెప్పేయొచ్చు.!

చరణ్-శంకర్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. చెర్రీతో తలపడనున్న విలన్ ఎవరంటే..