PM Kisan scheme: రైతులకు గమనిక..! పీఎం కిసాన్ పథకంలో చేరాలంటే ఇప్పుడు ఈ కార్డు తప్పనిసరి..
PM Kisan scheme: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పిఎం-కిసాన్) పథకం కింద మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి ప్రభుత్వం డాక్యుమెంట్ నిబంధనలలో
PM Kisan scheme: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పిఎం-కిసాన్) పథకం కింద మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి ప్రభుత్వం డాక్యుమెంట్ నిబంధనలలో మార్పులు చేసినట్లు తెలిసింది. కొత్త నిబంధనల ప్రకారం.. PM-KISAN ప్రయోజనాలను పొందాలంటే ప్రభుత్వం రేషన్ కార్డును తప్పనిసరి చేసింది. అర్హులైన వ్యవసాయ కుటుంబాలు ఇప్పుడు తమ రేషన్ కార్డ్ నంబర్, వాటి సాఫ్ట్ కాపీలతో పాటు ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, డిక్లరేషన్ ఫారమ్ సాఫ్ట్ కాపీలను PM-KISAN వెబ్‌సైట్‌లో సమర్పించాలి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 10వ విడత డిసెంబర్ 15న వచ్చే అవకాశం ఉంది.
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) పథకాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2018లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి కోసం ప్రతి ఏటా రూ.6వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఆరు వేల రూపాయలను ఒకేసారి ఇవ్వకుండా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అర్హత గల ప్రతి రైతు ఖాతాలో నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల చొప్పున జమ చేస్తుంది.
అయితే కొంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. ఎందుకంటే వీరి దరఖాస్తు విధానంలో తప్పులు ఉండటం వల్ల డబ్బులు రావడం లేదు. అయితే వీరి పేరుపై డబ్బులు మంజూరై ఉన్నాయి కానీ వీరు తప్పులు సరిదిద్దుకుంటేనే ఆ డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి. మొబైల్ యాప్ ద్వారా మీ పేరును చెక్ చేసుకోవడానికి ముందుగా PM కిసాన్ మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీరు యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీకు అన్ని వివరాలకు యాక్సెస్ ఉంటుంది.
రైతులు చేస్తున్న తప్పులు 1. ఖాతా యాక్టివేట్‌గా ఉండటం లేదు. హోల్డ్‌లో ఉంటుంది. 2 . వీరు ఇచ్చిన అకౌంట్ బ్యాంకులో ఉండటం లేదు. దీని అర్థం ఖాతా నంబర్ తప్పుగా ఉంటుంది. 3. పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (PFMS) ద్వారా రైతు రికార్డు ఆమోదించలేదు. 4. బ్యాంక్ తిరస్కరించిన ఖాతా అంటే ఖాతా మూసివేసారని అర్థం. 5. PFMS/ ద్వారా రైతు భూ రికార్డును తిరస్కరనకు గురైంది. 6. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఆధార్ లింక్ జరగలేదు. 7. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరక్షన్ పెండింగ్‌లో ఉంది.