Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Biryani Leaf: బిర్యానీ ఆకు సాగుతో లక్షల్లో సంపాదన.. కేవలం 50 మొక్కలతో ఆదాయం ఎంతో తెలిస్తే..

Biryani Leaf: మార్కెట్లో వ్యవసాయంలో సంప్రదాయ పంటలకు డిమాండ్‌కు అనుగుణంగా ఇతర పంటలకు కూడా ఉంది. ఆదాయం పెంచుకోవాలంటే అనేక మార్గాలున్నాయి..

Biryani Leaf: బిర్యానీ ఆకు సాగుతో లక్షల్లో సంపాదన.. కేవలం 50 మొక్కలతో ఆదాయం ఎంతో తెలిస్తే..
Biryani Leaf
Follow us
Subhash Goud

|

Updated on: Oct 26, 2021 | 12:47 PM

Biryani Leaf: మార్కెట్లో వ్యవసాయంలో సంప్రదాయ పంటలకు డిమాండ్‌కు అనుగుణంగా ఇతర పంటలకు కూడా ఉంది. ఆదాయం పెంచుకోవాలంటే అనేక మార్గాలున్నాయి. వివిధ రకాల పంటలను పండిస్తే మంచి లాభాలు పొందవచ్చు. అమెరికా, యూరప్, భారతదేశం సహా అనేక దేశాలలో అనేక రకాల వంటకాలు చేసేటప్పుడు బిర్యానీ ఆకులను ఉపయోగిస్తారని విషయం అందరికి తెలిసిందే. ఇది సూప్‌లు, వంటకాలు, మాంసం, మత్స్య , అనేక కూరగాయలలో ఉపయోగిస్తారు. ఈ బిర్యానీ ఆకు ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగం. ఇది చాలా వరకు భారతదేశం, రష్యా, మధ్య అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, ఉత్తర అమెరికా, బెల్జియంలో ఉత్పత్తి అవుతుంది. ఈ బిర్యానీ ఆకు పంట ద్వారా కూడా మంచి లాభాలు పొందవచ్చు.

ఇప్పుడు బిర్యానీ మొక్కల గురించి తెలుసుకుందాం. కేవలం 50 మొక్కలు నాటడం ద్వారా మీరు దాని ఆకుల నుండి ప్రతి ఏడాది రూ.1.50 లక్షల నుండి 2.50 లక్షల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. ఈ సాగులో ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టి జీవితాంతం సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాదు..కేంద్ర ప్రభుత్వం కూడా మీకు సహాయం చేస్తుంది. ఈ పంట సాగు కోసం మొదట్లో కష్టపడాల్సి ఉంటుంది. మొక్క పెరిగేకొద్దీ మాత్రమే జాగ్రత్త తీసుకోవాలి.

ప్రభుత్వం నుంచి సబ్సిడీ.. ఈ బిర్యానీ ఆకు సాగులో ప్రభుత్వం 30 శాతం సబ్సిడీ అందిస్తుంది. దీనికి మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. అయితే బిర్యానీ ఆకును పండించడం చాలా సులభం. అదనంగా, దాని సాగు కూడా చాలా చౌకగా ఉంటుంది. రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు. బిర్యానీ ఆకుల సాగును ప్రోత్సహించేందుకు జాతీయ ఔషధ మొక్కల బోర్డు ద్వారా 30 శాతం సబ్సిడీని రైతులకు అందజేస్తారు. ఒక అంచనా ప్రకారం.. ఒక మొక్క ప్రతి సంవత్సరం సుమారు 3000 నుండి 5000 రూపాయల వరకు సంపాదిస్తుందని ఔషద మొక్కల బోర్డు ద్వారా సమాచారం. 50 మొక్కల నుండి ఏడాదికి 1.50 లక్షల నుండి 2.5 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు.

ఇవి కూడా చదవండి:

Bank Holidays November 2021: కస్టమర్లకు అలర్ట్‌.. నవంబర్‌ నెలలో బ్యాంకులకు 17 రోజులు సెలవులు..!

Electric Scooters: కేవలం రూ.40 వేలకే ఎలక్ట్రిక్‌ వాహనం.. అత్యాధునిక టెక్నాలజీతో తయారీ..!