Bajaj: లీటర్‌కి 89 కిలోమీటర్ల మైలేజ్‌ ఇచ్చే బైక్‌.. కేవలం రూ.37 వేలు మాత్రమే..

uppula Raju

uppula Raju |

Updated on: Oct 26, 2021 | 1:16 PM

Bajaj ct100: పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో చాలా మంది ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్‌లు లేదా ఎక్కువ మైలేజీ వచ్చే బైక్‌ల కోసం చూస్తున్నారు.

Bajaj: లీటర్‌కి 89 కిలోమీటర్ల మైలేజ్‌ ఇచ్చే బైక్‌.. కేవలం రూ.37 వేలు మాత్రమే..
Bajaj Ct100

Follow us on

Bajaj ct100: పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో చాలా మంది ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్‌లు లేదా ఎక్కువ మైలేజీ వచ్చే బైక్‌ల కోసం చూస్తున్నారు. ఎలక్ట్రిక్ బైక్‌ల ధర చాలా ఎక్కువ కావడంతో ఏం చేయాలో తెలియక మైలేజీ బైకుల వైపే మొగ్గచూపుతున్నారు. మీరు కూడా ఈ పరిస్థితిలోనే ఉంటే ఒక మైలేజీ బైక్ కేవలం 37 వేల రూపాయలకే లభిస్తుంది. ఇది లీటర్‌కు 89 కిమీ మైలేజీని ఇస్తుంది. బైక్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ బైక్‌ పేరు బజాజ్ CT 100. బజాజ్‌ కంపెనీలో ప్లాటినా తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ ఇదే. ఈ బైక్ తక్కువ బరువు, ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. మీరు ఈ బైక్‌ని షోరూమ్ నుంచి కొనుగోలు చేస్తే ధర రూ.52,832 నుంచి రూ.53,696 వరకు ఉంటుంది. అయితే ఈ బైక్‌ సెకండ్‌ హ్యాండ్ బైక్. కేవలం 37 వేల రూపాయలకే ఇంటికి తీసుకెళ్లవచ్చు. బైక్, బజాజ్ ఫీచర్ల గురించి ఓ లుక్కేద్దాం.

బజాజ్ CT 100 ఇంజిన్ బజాజ్ CT 100లో కంపెనీ 102 cc ఇంజిన్‌ను అందిస్తుంది. ఇది ఎయిర్-కూల్డ్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఈ ఇంజన్ 7.9 PS పవర్, 8.34 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. అలాగే 4 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అందించారు. బైక్ మైలేజీకి సంబంధించి ఇది ఒక లీటర్ పెట్రోల్‌కి 89.5 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

బజాజ్ CT 100 కీ కండిషన్ బజాజ్ CT 100 బైక్‌ కార్స్24 అనే వెబ్‌సైట్‌లో జాబితా విక్రయానికి ఉంది. ఇది సెకండ్ హ్యాండ్ సెగ్మెంట్ బైక్. వెబ్‌సైట్‌లో ఈ బైక్ ధర 37 వేల రూపాయలుగా చెప్పారు. అందులో ఉన్న సమాచారం ప్రకారం.. ఇది 2018 సంవత్సరానికి చెందిన మోడల్. ఈ బైక్ ఇప్పటివరకు 54,275 కిలోమీటర్లు ప్రయాణించింది. రిజిస్ట్రేషన్ ఉత్తరప్రదేశ్‌లోని UP14 RTOలో నమోదు చేసి ఉంది.

బజాజ్ CT 100 వారంటీ కంపెనీ కొన్ని షరతులతో 12 నెలల వారంటీని ఇస్తుంది. అలాగే 7 రోజుల మనీ బ్యాక్ గ్యారెంటీ కూడా అందుబాటులో ఉంది. ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్ లేదా కారు కొనుగోలు చేసే ముందు దాని గురించి ఇచ్చిన సమాచారాన్ని జాగ్రత్తగా చదవాలని గుర్తుంచుకోండి.

గమనిక: ఈ సమాచారం Bikes24.comలో ఉంది. దీనికి టీవీ9కి ఎటువంటి సంబంధం లేదని గుర్తించండి.

Drinking Water: నిలబడి నీళ్లు తాగుతున్నారా..! ఈ విషయం తెలిస్తే ఈ సాహసం అస్సలు చేయరు..

Crime News: మహిళా రేషన్ డీలర్ వీరంగం.. ప్రభుత్వ ఉద్యోగుల కళ్లల్లో కారం కొట్టిన రేషన్ డీలర్

India Post Recruitment 2021: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్..! పోస్ట్ మ్యాన్‌, పోస్టల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu