India Post Recruitment 2021: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్..! పోస్ట్ మ్యాన్‌, పోస్టల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్..

India Post Recruitment 2021: స్పోర్ట్స్ కోటా కింద పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. డిపార్ట్‌మెంట్

India Post Recruitment 2021: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్..! పోస్ట్ మ్యాన్‌, పోస్టల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్..
India Post Recruitment
Follow us
uppula Raju

|

Updated on: Oct 26, 2021 | 12:48 PM

India Post Recruitment 2021: స్పోర్ట్స్ కోటా కింద పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఆధ్వర్యంలోని ఢిల్లీ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయం భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. https://www.indiapost.gov.inలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. కింది పోస్టులకు అర్హులైన క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

1. పోస్టల్ అసిస్టెంట్ – 72 2. పోస్ట్‌మ్యాన్ – 90 3. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ – 59

పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ పోస్టు: అభ్యర్థి తప్పనిసరిగా 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్: అభ్యర్థి తప్పనిసరిగా 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. పోస్టల్/సార్టింగ్ అసిస్టెంట్ – పే మ్యాట్రిక్స్‌లో లెవల్ 4 (రూ. 25,500-81,100) పోస్ట్‌మ్యాన్ – పే మ్యాట్రిక్స్‌లో లెవల్ 3 (రూ. 21,700-69,100) MTS – పే మ్యాట్రిక్స్‌లో లెవల్ 1 (రూ. 18,000-56,900)

అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో www.indiapost.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు . వారు సంబంధిత పత్రాలతో పాటు పోస్ట్ ద్వారా దరఖాస్తులను AD (Recrt.), O/o CPMG, ఢిల్లీ సర్కిల్, మేఘదూత్ భవన్, న్యూఢిల్లీ – 110001కు సమర్పించవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 12, 2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Rugged e Bike: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్లు.. ఈ బైక్ గో.. రగ్డ్ ఎలక్ట్రిక్ బైక్స్ బుకింగ్స్ అదిరిపోయాయి..

YSR Rythu Bharosa: రైతులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ఒకే రోజు మూడు పథకాల కింద నిధులు.. అకౌంట్లు డబ్బులు జమ చేసిన సీఎం జగన్‌

Huzurabad Election: క్లైమాక్స్‌కి చేరిన హుజూరాబాద్ వార్.. ఈటల గెలుపు ఖాయం.. మెజార్టీ ఎంతో తేలాలన్న కిషన్ రెడ్డి