AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSR Rythu Bharosa: రైతులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ఒకే రోజు మూడు పథకాల కింద నిధులు.. అకౌంట్లు డబ్బులు జమ చేసిన సీఎం జగన్‌

YSR Rythu Bharosa: ఏపీలో రైతులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్‌ నిధులను ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం విడుదల..

YSR Rythu Bharosa: రైతులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ఒకే రోజు మూడు పథకాల కింద నిధులు.. అకౌంట్లు డబ్బులు జమ చేసిన సీఎం జగన్‌
Subhash Goud
|

Updated on: Oct 26, 2021 | 12:16 PM

Share

YSR Rythu Bharosa: ఏపీలో రైతులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్‌ నిధులను ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం విడుదల చేశారు. వైఎస్సార్‌ రైతుభరోసా, వైఎస్సార్‌ సున్నావడ్డీ, వైఎస్సార్‌ యంత్ర సేవాపథకం.. ఈ మూడు పథకాలకు సంబంధించి రూ.2,190 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా రైతులు, రైతు గ్రూపుల ఖాతాల్లో జమ చేశారు. అన్నదాతలకు వైఎస్సార్‌ రైతుభరోసా-పీఎం కిసాన్‌ కింద పెట్టుబడి సాయంగా 50.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,052 కోట్లను జమచేయనున్నారు.

రెండో విడత సాయం..

కాగా, 2021–22 సంవత్సరానికి సంబంధించి తొలివిడతగా మే 13న రూ.3,811.96 కోట్ల సాయం అందించిన ప్రభుత్వం.. ఇప్పుడు రెండోవిడతగా 50.37 లక్షల మంది రైతులకు రూ.2052 కోట్లు అందిస్తోంది. ఈ ఏడాది లబ్ధిపొందుతున్న రైతు కుటుంబాల్లో 48,86,361 మంది భూ యజమానులు కాగా, అటవీభూములు సాగుచేస్తున్న వారు 82,251 మందితోపాటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాస్తవ సాగు(కౌలు)దారులు 68,737 మంది లబ్ధిపొందుతున్నారు. మూడు సంవత్సరాలుగా లబ్ధి పొందుతున్న వారిసంఖ్య పెరుగుతూ వస్తోంది.

ఇక వైఎస్సార్‌ సున్నావడ్డీ పంట రుణాల పథకంలో రుణాలను గడువులోగా తిరిగి చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ఇస్తోంది. రూ.లక్షలోపు పంట రుణాలను సకాలంలో తిరిగి చెల్లించిన వారికి వైఎస్సార్‌ సున్నావడ్డీ కింద రాయితీ ఇస్తూ వారికి అండగా నిలుస్తోంది. ఏడాది తిరగకుండానే ఈ వడ్డీ రాయితీ సొమ్మును జమచేస్తోంది. ఈ సీజన్‌లో రూ.లక్షలోపు 11,03,228 మందికి రూ.6,389 కోట్ల రుణాలు అందించారు. ఈ- క్రాప్, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం వీరిలో 6.67 లక్షల మంది సున్నావడ్డీకి అర్హులుగా గుర్తించారు. ఇలా అర్హత పొందినవారి ఖాతాలకు వైఎస్సార్‌ సున్నావడ్డీ రాయితీ కింద రూ.112.70 కోట్లను ప్రభుత్వం జమచేస్తోంది.

చిన్న, సన్నకారు రైతులకు..

చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చింది జగన్‌ సర్కార్‌. వాటికి సంబంధించి సబ్సిడీ సొమ్ము రూ.25.55 కోట్లను రైతు గ్రూపులకు జమచేయనుంది. ఈ ఈ స్కీమ్‌ కింద రూ.2,134 కోట్ల విలువైన వ్యవసాయ యంత్రాలను 11,785 రైతుగ్రూపుల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ మొత్తంలో 854 కోట్లు అంటే 40 శాతం మేర సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరిస్తుండగా, 10 శాతం అంటే రూ.213 కోట్లు రైతు కమిటీలు భరిస్తున్నాయి. మిగిలిన 50 శాతంగా 1,067 కోట్లు బ్యాంకులు రుణంగా ఇస్తున్నాయి. ఈ విధంగా రాష్ట్ర రైతులకు మేలు జరిగే విధంగా పథకాలను ప్రవేశపెట్టి అండగా నిలుస్తోంది ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి:

Vehicle Number Plate: ఇక నుంచి వాహనం నెంబర్‌ ప్లేట్లపై ఇలాంటివి కనిపిస్తే మీ పని అంతే..!

Covid 19 Ex-Gratia: కోవిడ్‌ సహాయంపై ఏపీ సర్కార్‌ కీలక ఉత్తర్వులు.. ఆ కుటుంబాలకు రూ.50 వేలు