Space Robotics: నాసా స్పేస్ రోబోటిక్స్‌లో శ్రీకాకుళం యువకుడి టాలెంట్..! అంతర్జాతీయ గుర్తింపు.. (వీడియో)

ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువకుడు రాష్ట్రానికే అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారు. నాసా స్పేస్‌ రోబోటిక్స్‌ చాలెంజ్‌లో ఓ టీం తరపున ప్రాతినిధ్యం వహించి తన టాలెంట్ నిరూపించుకున్నాడు.

Space Robotics: నాసా స్పేస్ రోబోటిక్స్‌లో శ్రీకాకుళం యువకుడి టాలెంట్..! అంతర్జాతీయ గుర్తింపు.. (వీడియో)

|

Updated on: Oct 26, 2021 | 9:56 PM

ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువకుడు రాష్ట్రానికే అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారు. నాసా స్పేస్‌ రోబోటిక్స్‌ చాలెంజ్‌లో ఓ టీం తరపున ప్రాతినిధ్యం వహించి తన టాలెంట్ నిరూపించుకున్నాడు. సుదూర గ్రహాలు, ఉపగ్రహాల ఉపరితలాలపై ఖనిజాలను సమకూర్చుకోవడంతో పాటు వెనక్కి ఎలా తీసుకోవాలి? అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎలా దోహదపడతాయి? అనే అంశాలపై వర్చువల్‌ విధానంలో రోబోటిక్‌ సాప్ట్‌వేర్‌ తయారీపై నాసా స్పేస్‌ రోబోటిక్స్‌ చాలెంజ్‌ సంస్థ పోటీ నిర్వహించింది.ఇందులో విశ్వవిజేతగా నిలిచిన బృందంలో శ్రీకాకుళానికి చెందిన కొత్తకోట సాయికిశోర్‌ ఒకరు. విజేతగా నిలిచిన సాయికిషోర్‌ బృందం కోటి 30 లక్షల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం స్పెయిన్‌లో పాల్‌ రోబోటిక్స్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న సాయికిశోర్‌ తన సహోద్యోగులతో కలిసి ఒలంపస్‌ మోన్స్‌ టీంగా ఏర్పడి ఈ చాలెంజ్‌లో పాల్గొన్నారు.

మల్టీ-రోబో టీం అంతరిక్షంలోకి వెళ్లే విధానం.. త్వరగా ఖనిజాన్ని సేకరించే ప్రోసెస్.. జీపీఎస్‌ లేకుండా పనిచేసుకుని, తిరిగి లొకేషన్‌కు వచ్చేలా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది ఈ టీం. చంద్రునిపై ఖనిజాలు ఎక్కడ ఉన్నాయో వెదికి, తవ్వి లోడ్ చేసి, మోసుకొచ్చేలా రోబోలకు సాఫ్ట్ వేర్ డిజైన్ చేశారు. ఇవన్నీ దేని పని అది చేసుకుంటాయి.ఈ పోటీలో ప్రపంచవ్యాప్తంగా 114 టీంలు పాల్గొనగా 22 బృందాలు ఫైనల్‌కు వచ్చాయి. తుది పోరులో స్పెయిన్‌కు చెందిన ఒలంపస్‌ మోన్స్‌ టీం ఫస్ట్ పొజిషన్‌లో నిలిచింది. ఇదే పోటీలో నాసా ఇన్నోవేషన్‌ అవార్డు కూడా చేజిక్కించుకుంది. ఈ బృందంలో శ్రీకాకుళానికి చెందిన కొత్తకోట సాయికిశోర్‌ సభ్యుడిగా ఉండటం రాష్ట్రానికి గర్వకారణం.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Viral Video: 70 ఏళ్ల వయసులో కాన్పు..! పెళ్లయిన 45 ఏళ్లకు మాతృత్వం.. ఈ అరుదైన ఘటనపై నెటిజన్ల కామెంట్స్..(వీడియో)

Viral Video: అంకుల్‌.. ఆంటీని ఒక్కసారి హగ్‌ చేసుకోవచ్చా..? పర్మిషన్‌ అడిగిన చిన్నారి.. ఫిదా అవుతున్న నెటిజన్లు..(వీడియో)

Follow us