Travel influencer: ఏడాది బుడ్డోడు.. నెలకు రూ. 75 వేలు సంపాదిస్తున్నాడు..! వైరల్ అవుతున్న వీడియో..
బుడిబుడి అడుగుల చిన్నారి.. ముద్దుముద్దు మాటలతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారిపోయాడు. నెలకు దాదాపు 75వేల రూపాయలు సంపాదించేస్తున్నాడు! అమెరికాకు చెందిన ఈ బుడ్డోడి స్టోరీ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
బుడిబుడి అడుగుల చిన్నారి.. ముద్దుముద్దు మాటలతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారిపోయాడు. నెలకు దాదాపు 75వేల రూపాయలు సంపాదించేస్తున్నాడు! అమెరికాకు చెందిన ఈ బుడ్డోడి స్టోరీ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఏడాది వయసున్ బుడతడి పేరు బ్రిగ్స్. పుట్టిన మూడు వారాలకే షికారు మొదలుపెట్టేశాడు. ఓ 45 సార్లు విమానం ఎక్కాడు. తను వెళ్లిన అందమైన ప్రదేశాలను ఎంజాయ్ చేశాడు. ఆ విషయాలన్నింటినీ whereisbriggs అనే ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా పంచుకొని పాపులరయ్యాడు. బ్రిగ్స్ ఖాతాను ప్రస్తుతం 30 వేల మందికి పైగా అనుసరిస్తున్నారు.
అసలు ఈ పర్యటనలు చేయాలన్న ఆలోచన బ్రిగ్స్ వాళ్ల అమ్మ జెస్‌ది. ఆమె పార్ట్ టైమ్ టూరిస్ట్స్ బ్లాగ్ నడిపేది. ప్రపంచాన్ని చుట్టిరావడానికి ఆమెకు బ్లాగ్ ద్వారా కొంత మొత్తం అందుతుంది. గర్భం దాల్చినప్పుడు, ఇక కెరీర్ ముగిసిపోయిందని చాలా ఆందోళన చెందిందామె. చిన్నపిల్లతో వృత్తిలో కొనసాగడం సాధ్యమా అని ఆలోచించింది. భర్తతో చర్చించి ట్రావెలింగ్‌నే కొనసాగించాలనుకుంది. బేబీ ట్రావెల్‌పై సోషల్ మీడియా ఖాతాలేవైనా ఉన్నాయా అని వెతికితే, ఒక్కటి కూడా కనిపించలేదట. ఆ పనేదో తనే ఎందుకు చేయకూడదు అనుకుందామె. మొదటిసారి చిన్నారులతో ప్రయాణించే తల్లిదండ్రులకు ఎదురయ్యే ఇబ్బందులను వివరించాలనుకుంది. ఆ ఆలోచన నుంచే whereisbriggs పుట్టుకొచ్చింది.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

