Police Man video: పలుగుపార పట్టి రోడ్డు మరమ్మతులు చేపట్టిన పోలీసులు.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. (వీడియో)
నిత్యం లాఠీలు, తుపాకులు చేత పట్టుకొని డ్యూటీలో బిజీగా ఉండే పోలీసులు పలుగు, పార పట్టారు.. టోపీలను మోసిన తలలు మట్టి తట్టలను మోశాయి. చట్టాలను రక్షించే పోలీసులు ప్రజల చుట్టాలైపోయారు. ఖాకీలు పల్లెల గోసకు కరుణతో కరిగిపోయారు.
నిత్యం లాఠీలు, తుపాకులు చేత పట్టుకొని డ్యూటీలో బిజీగా ఉండే పోలీసులు పలుగు, పార పట్టారు.. టోపీలను మోసిన తలలు మట్టి తట్టలను మోశాయి. చట్టాలను రక్షించే పోలీసులు ప్రజల చుట్టాలైపోయారు. ఖాకీలు పల్లెల గోసకు కరుణతో కరిగిపోయారు. ఈ అరుదైన ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో చోటు చేసుకుంది.గత కొన్ని రోజులుగా పెద్దవంగర మండలంలోని తిరుమలగిరి, తొర్రూరు ప్రధాన రహదారి దుస్థితి దయనీయంగా మారింది. వడ్డెకొత్తపల్లి సమీపంలో గల బ్రిడ్జిపై గుంతలు ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి..వరుస ప్రమాదాలతో ఈ రహదారిపై ప్రయాణించాలంటేనే..వాహనదారులు, ప్రయాణికులను బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలోనే పెద్దవంగర మండలానికి కొత్తగా ఎస్సైగా బాధ్యతలను చెప్పట్టిన రియాజ్ పాషా స్పందించాడు.. ప్రజలు పడుతున్న రహదారి కష్టాలు చూసి చలించిపోయాడు…ప్రమాదాలను కొంతైనా నివారించాలని..భావించిన ఎస్సై రియాజ్ పాషా తన సిబ్బంది సుభాష్ ,శ్రీనివాస్ తో కలిసి బ్రిడ్జిపై ఉన్న గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టారు..రాళ్లు పోయించి..మట్టితో గుంతలు పూడ్చారు..ఇదంతా చూసిన స్థానికులు, వాహనదారులు ఈ పోలీసులకు హ్యాట్సాఫ్ చెప్పారు. శభాష్ పోలీస్ అంటూ అభినందనలు తెలిపారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..
Earthquake Live Video: భూకంపం లైవ్ వీడియో.. వైరల్ అవుతున్న షాకింగ్ విజువల్స్..!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

