Rugged e Bike: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్లు.. ఈ బైక్ గో.. రగ్డ్ ఎలక్ట్రిక్ బైక్స్ బుకింగ్స్ అదిరిపోయాయి..
ఈ బైక్ గో (E-Bike Go) రెండు నెలల క్రితం తన రగ్డ్ (Rugged) ఈ బైక్‌ను విడుదల చేసింది. E-Bike Go తన ఎలక్ట్రిక్ బైక్ కోసం లక్షకు పైగా ఆర్డర్‌లను అందుకున్నట్లు పేర్కొంది.
Rugged e Bike: ఈ బైక్ గో (E-Bike Go) రెండు నెలల క్రితం తన రగ్డ్ (Rugged) ఈ బైక్‌ను విడుదల చేసింది. E-Bike Go తన ఎలక్ట్రిక్ బైక్ కోసం లక్షకు పైగా ఆర్డర్‌లను అందుకున్నట్లు పేర్కొంది. దీనితో కంపెనీ ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఇది ఎప్పటికీ బలమైన ఎలక్ట్రిక్ బైక్‌లలో ఒకటిగా నిలుస్తుందని కంపెనీ చెబుతోంది. రాబోయే నెలల్లో 50,000 బుకింగ్‌లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. దీపావళికి Rugged ఎలక్ట్రిక్ స్కూటర్ రెడ్, బ్లూ, బ్లాక్, రగ్డ్ స్పెషల్ ఎడిషన్ అనే నాలుగు కొత్త కలర్ ఆప్షన్‌లలో కూడా విడుదల చేస్తోంది.
రగ్డ్ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కి.మీ పరిధిని పొందుతుంది
రగ్డ్ అనేది మేడ్-ఇన్-ఇండియా ఉత్పత్తి. ఇది 3kW మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలదు. ఇ-బైక్ లోపల 2 x 2 kWh బ్యాటరీని మార్చవచ్చు. దీన్ని దాదాపు 3.5 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. ఈ బైక్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 160 కిమీల రేంజ్‌ను అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇ-బైక్ బాడీ స్టీల్ ఫ్రేమ్, క్రెడిల్ చట్రంతో రూపొందించారు. ఇది 30 లీటర్ల స్టోరేజ్ స్పేస్‌ను కలిగి ఉండగా, ఉత్పత్తి 12 స్మార్ట్ సెన్సార్‌లను పొందుతుంది.
రగ్డ్ ఎలక్ట్రిక్ బైక్ ధర
రూ.85,000 నుండి ప్రారంభమై రూ. 1.05 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. ఈ ధరలు సబ్సిడీకి ముందు ఉన్నాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీని బట్టి దీని ధరలు మారవచ్చు. ఇది G1 అదేవిధంగా G1+ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.
ఇప్పటికే భారత్ లో ఎలక్ట్రిక్ బైక్ హవా పెరిగింది. వినియోగదారులు కూడా ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు వైపు మెల్లగా మారిపోతున్నారు. స్వదేశీ కంపెనీలకు ప్రస్తుతం వినియోగదారులు కూడా మద్దతు పలుకుతున్నారు. ఈ నేపధ్యంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ బైక్ లను విడుదల చేయడం పై దృష్టి సారించాయి. ఇప్పటికే దాదాపుగా పెద్ద కంపెనీలు అన్నీ తమ కేటలాగ్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లను కలిగి ఉన్నాయి. ఈ నేపధ్యంలో రగ్డ్ ఈ బైక్ కు లభిస్తున్న ఆదరణ చెప్పుకోదగినది.
ఇవి కూడా చదవండి: Jio Phone Next: ప్రగతి ఓఎస్ తో జియోఫోన్ నెక్స్ట్.. జియో విడుదల చేసిన సరికొత్త ఫీచర్లు ఇవే!
NASA about Aliens: గ్రహాంతరజీవుల ఉనికి ఉండవచ్చు.. నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానం!