Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: మరింత కిందికి జారిపోయిన ఐఆర్సీటీసీ షేర్లు.. ఇప్పుడు అమ్మడం మంచిదా? కొనుగోలు మంచిదా? నిపుణులు ఏమంటున్నారు?

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) షేర్లు స్థిరంగా క్షీణిస్తున్నాయి. ఐఆర్సీటీసీ(IRCTC) షేర్లు సోమవారం రూ.593.55 (12.84%) తగ్గి రూ.4,029 వద్ద ముగిసింది.

IRCTC: మరింత కిందికి జారిపోయిన ఐఆర్సీటీసీ షేర్లు.. ఇప్పుడు అమ్మడం మంచిదా? కొనుగోలు మంచిదా? నిపుణులు ఏమంటున్నారు?
Irctc Shares
Follow us
KVD Varma

|

Updated on: Oct 26, 2021 | 11:28 AM

IRCTC:  ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) షేర్లు స్థిరంగా క్షీణిస్తున్నాయి. ఐఆర్సీటీసీ(IRCTC) షేర్లు సోమవారం రూ.593.55 (12.84%) తగ్గి రూ.4,029 వద్ద ముగిసింది. 52 వారాల గరిష్ట స్థాయి రూ.6,393 నుంచి దాదాపు 38% నష్టపోయింది. ఐఆర్సీటీసీ అక్టోబర్ 20న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) F&O నిషేధ జాబితాలో చేర్చింది. బ్యాన్ లిస్టులో పెట్టడం వల్ల గత వారం కూడా ఈ స్టాక్ ఒత్తిడిలోనే ఉంది. ఈ స్టాక్ సోమవారం నిషేధం జాబితా నుండి బయటపడినప్పటికీ, ఇప్పటికీ అది క్షీణించింది. షార్ట్ ట్రేడర్లు స్టాక్‌ను మరింత దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని కొందరు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

వాల్యుయేషన్స్.. ప్రాఫిట్ బుకింగ్

పతనానికి కారణాలు విశ్లేషకుల ప్రకారం, గత కొన్ని నెలలుగా ర్యాలీ తర్వాత వాల్యుయేషన్స్.. ప్రాఫిట్ బుకింగ్ గురించి ఆందోళనలు కారణంగా స్టాక్ అకస్మాత్తుగా పతనమైంది. మ్యూచువల్ ఫండ్స్, విదేశీ పెట్టుబడిదారులు కూడా ఐఆర్సీటీసీ(IRCTC)లో తమ వాటాను తగ్గించుకున్నారు. అయితే, స్టాక్ యొక్క ఫండమెంటల్స్ ఇప్పటికీ బలంగా ఉన్నాయి. రూ. 4,000-3,700 స్థాయి స్ట్రాంగ్ డిమాండ్ జోన్ సాంకేతిక విశ్లేషకుల ప్రకారం, ఐఆర్సీటీసీకి రూ. 4,000-3,700 స్థాయి బలమైన డిమాండ్ జోన్ ఉంది. అయితే ఈ స్టాక్ రూ.4,500 స్థాయిని దాటడం కాస్త కష్టమే. 4,500 స్థాయి ప్రస్తుతం స్టాక్ కు సంబంధించి 20 రోజుల మూవింగ్ యావరేజ్.

ప్రస్తుత స్థాయిలలో కొనుగోలు చేయమని సిఫార్సు చేయడం లేదు. కానీ, మీరు ఇప్పటికే స్టాక్‌ను కలిగి ఉన్నట్లయితే, పతనం కారణంగా విక్రయించే బదులు, విశ్లేషకులు స్టాక్‌ను ఎక్కువ కాలం ఉంచుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. ఐఆర్సీటీసీ స్టాక్ స్థిరంగా మంచి పనితీరును కనబరుస్తూ దాదాపు 900% రాబడిని ఇచ్చింది. అక్టోబర్ 2019లో లిస్టింగ్ అయినప్పటి నుండి, స్టాక్ 19 అక్టోబర్ 2021 వరకు దాదాపు 900% రాబడిని ఇచ్చింది. గత 3 నెలల గురించి మాట్లాడితే, స్టాక్ 100% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. ఇష్యూ ధర రూ. 320కి వ్యతిరేకంగా 100% కంటే ఎక్కువ ప్రీమియంతో స్టాక్ రూ.644 వద్ద జాబితా అయింది.

ఐఆర్సీటీసీ చెల్లింపు అగ్రిగేటర్ లైసెన్స్ తీసుకోవాలని యోచిస్తోంది

ఐఆర్సీటీసీ విస్తరణ ప్రణాళిక గురించి మాట్లాడుతూ, కంపెనీ తన వ్యాపారాన్ని బస్సు, విమాన టిక్కెట్‌లతో పాటు టూర్, ట్రావెల్ ప్లానర్‌లకు విస్తరిస్తోంది. ఇది సంస్థ స్థితిని మరింత బలోపేతం చేయవచ్చు. ఇది కాకుండా, ఐఆర్సీటీసీ ఆర్బీఐ నుండి చెల్లింపు అగ్రిగేటర్ లైసెన్స్ పొందాలని యోచిస్తోంది. దీని వల్ల వినియోగదారులకు సౌకర్యం పెరగడమే కాకుండా అదనపు ఆదాయం కూడా వస్తుంది.

ఆన్‌లైన్ రైలు బుకింగ్‌లో ఐఆర్సీటీసీ 73% మార్కెట్ వాటా

భారతీయ రైల్వేలకు ఐఆర్సీటీసీ క్యాటరింగ్ సేవ, ఆన్‌లైన్ రైల్వే టిక్కెట్‌లను అందిస్తుంది. ఇది కాకుండా, ఐఆర్సీటీసీ రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సర్వీస్‌ను కూడా అందిస్తుంది. ఆన్‌లైన్ రైలు బుకింగ్‌లో ఐఆర్సీటీసీ మార్కెట్ వాటా 73%, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌లో 45%.

ఇవి కూడా చదవండి: NASA about Aliens: గ్రహాంతరజీవుల ఉనికి ఉండవచ్చు.. నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానం!

Bangladesh Riots: ఫేస్‌బుక్‌లో పాపులర్ కావాలని అతను చేసిన పని మతాల మధ్య చిచ్చుపెట్టింది!

Economy Growth: పరుగులు పెట్టనున్న భారత ఆర్ధిక వ్యవస్థ..9.5 శాతం వృద్ధి సాధించే అవకాశం..