PM Kisan: రైతులకు గుడ్న్యూస్.. ఇకపై 2 వేలు కాదు.. 4 వేలు.. ఏకంగా రూ. 12 వేలు ఖాతాల్లోకి.. ఎప్పుడంటే..
దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్రప్రభుత్వం ఆర్థిక భరోస కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన్ మంత్రి సమ్మాన్ నిధి ద్వారా ప్రతి ఏటా
దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్రప్రభుత్వం ఆర్థిక భరోస కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన్ మంత్రి సమ్మాన్ నిధి ద్వారా ప్రతి ఏటా రూ. 6 వేల వరకు రైతుల ఖాతాల్లో జమచేస్తుంది కేంద్రం. అయితే తాజాగా రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అంటే రైతులకు ప్రతి సంవత్సరం కేంద్రం రూ. 6 వేలను విడతల వారిగా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 6 వేలకు బదులుగా రూ. 12 వేలు ఇవ్వనుంది. దీంతో ప్రతి విడతలో రైతులకు రూ. 2 వేలకు బదులుగా రూ. 4 వేలు జమకానున్నాయి. 2021దీపావళీ నాటికి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇదిలా ఉంటే.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు త్వరలో 10వ విడత నగదు అందుకోనున్నారు. పదవ విడత నగదు ట్రాన్స్ఫర్ చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు అధికారులు. డిసెంబర్ 15న రైతులకు 10వ విడత నగదు అందించనున్నట్లుగా సమాచారం. ఇప్పటివరకు దేశంలోని 11.37 కోట్ల మంది రైతులకు ప్రభుత్వం రూ.1.58 లక్షల కోట్లను బదిలీ చేసింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 10వ విడతను డిసెంబర్ 15, 2021 నాటికి విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వం గత ఏడాది 25 డిసెంబర్ 2020న రైతులకు డబ్బును బదిలీ చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాలను పొందాలనుకునే రైతులు అక్టోబర్ 30 లేదా అంతకు ముందు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ముందు విడత అందుకోకపోతే వాళ్లు చివరి విడత మొత్తాన్ని తర్వాతి విడతతో పాటుగా రూ. 4000 నేరుగా వారి ఖాతాలో పొందుతారు. ఖాతా. నమోదుకు చివరి తేదీ 30 అక్టోబర్ 2021.
PM-KSNY విడతను తనిఖీ చేయడానికి దశలు: * ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/. లాగిన్ కావాలి * హోమ్ పేజీలో ఫార్మర్ కార్నర్ సెక్షన్ ఓపెన్ చేయాలి. * ఆ తర్వాత బెనిఫిషియరీ స్టేటస్ సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ లబ్ధిదారుడు.. వారి అప్లికేషన్ స్టేటస్ తనిఖీ చేయవచ్చు. అందులో రైతుల పేరు.. వారి బ్యాంకు వివరాలు ఉంటాయి. * ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ లేదా ఖాతా నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. * ఆ తర్వాత గెట్ డేటా ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Also Read: Sridevi Soda Center: ఓటీటీలో అలరించనున్న శ్రీదేవి సోడా సెంటర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Ram Charan : అంచనాలు పెంచేస్తున్న చరణ్- శంకర్ సినిమా.. ఒక్క పాట కోసం భారీ ప్లాన్ చేసిన మేకర్స్..
Megastar Chiranjeevi: మెగాస్టార్ కోసం దివ్యాంగుడి సాహసం.. ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..