Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: మెగాస్టార్ కోసం దివ్యాంగుడి సాహసం.. ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

మనం అభిమానించే హీరోహీరోయిన్స్ సినిమా వచ్చిందంటే చాలు ఫ్యాన్స్ చేసే హడావిడి గురించి తెలిసిన విషయమే. తమ హీరో

Megastar Chiranjeevi: మెగాస్టార్ కోసం దివ్యాంగుడి సాహసం.. ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Megastar
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 26, 2021 | 7:38 AM

మనం అభిమానించే హీరోహీరోయిన్స్ సినిమా వచ్చిందంటే చాలు ఫ్యాన్స్ చేసే హడావిడి గురించి తెలిసిన విషయమే. తమ హీరో సినిమా విడుదలైందంటే పండగల జరుపుకుంటుంటారు. ఈ అభిమానం కేవలం సినిమా వరకే ఉండదు.. తమ అభిమాన హీరో పుట్టిన రోజున అన్నదానం చేయడం.. రక్తదాన శిబిరం నిర్వహించడం చేస్తుంటారు. అంతేకాదు.. తమ హీరో గురించి ఎవరైనా నోరు జారితే కయ్యానికి కాలు దువ్వుతుంటారు.. ఇన్ని చేసిన తమ హీరోను కలవాలని.. సెల్ఫీ తీసుకోవాలని మాత్రమే ఆశపడుతుంటారు…ఇక తమ హీరో గురించి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తుంటాం. ఒక్కసారైనా వారిని కలిసి మాట్లాడాలని..అందుకు ఎంతటి రిస్క్ అయిన చేయడానికి వెనకడారు. ఇక హీరోలు సైతం తమ అభిమానుల కోసం ఒక మెట్టు దిగుతుంటారు. తమ నివాసాల్లో తమ అభిమానులను కలవడం.. వారికి ఆర్థికంగా సాయం చేయడం చేస్తుంటారు… తాజాగా తన కోసం అంగవైకల్యాన్ని సైతం పట్టించుకోకుండా పాదయాత్ర చేసిన అభిమానిని మెగాస్టార్ చిరంజీవి కలిసి మాట్లాడారు..

మెగాస్టార్ చిరంజీవి.. చిత్రపరిశ్రమలో ఆయనే ఓ రికార్డ్.. తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం రీఎంట్రీ షూరు చేసిన చిరంజీవి వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు.. మెగాస్టార్ చిరంజీవికి ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కుర్రకారు వరకు మెగాస్టార్ ఫేవరేట్. తాజాగా ఓ అభిమాని మెగాస్టార్ చిరంజీవి కోసం ఏకంగా 727 కి.మీ పాదయాత్ర చేశాడు.. అమలాపురం నుండి హైదరాబాద్ పాదయాత్రగా వెళ్ళిన అభిమానిని మెగాస్టార్ చిరంజీవి కలుసుకున్నారు.. అంగవైకల్యని సైతం లెక్కచేయకుండా చిరంజీవిని కలవడనికి పాదయాత్రగా వెళ్ళాడు అభిమాని గంగాధర్..

ఉప్పలగుప్తం మండలం కిత్తన చెరువు గ్రామానికి చెందిన దివ్యాంగుడు డెక్కల గంగాధర్ (32) మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. ఆయనను కలవాలని ఈ నెల 3వ తేదీ అమలాపురం నుండి పాదయాత్ర చేపట్టి 23 రోజులు 727 కి. మీ నడిచి సోమవారం బ్లడ్ బ్యాంక్ దగ్గరకి చేరుకున్నాడు.. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే అభిమానిని ఇంటికి పిలిపించుకుని కాసేపు ముచ్చటించారు మెగాస్టార్.. వికలాంగుడి సాహసానికి ఉబ్బితప్పిపోయిన చిరంజీవి మాట్లాడుతూ.. చాలా పెద్ద సాహసం చేసావంటూ, మరోసారి నిన్ను ప్రత్యేకంగా పిలిపించుకుంటానని చెప్పారు..దీంతో తన కల నిజమైందంటూ ఆనందంలో మునిగి తెలాడు గంగాధర్.

Also Read: వర్మ రింగ్ మాస్టర్..  ఆసక్తికర కామెంట్స్ చేసిన మంచు మనోజ్.. హిలేరియస్ ఆన్సర్ ఇచ్చిన ఆర్జీవి.

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌లో ప్రియ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.? ఏడు వారాలకు ఏకంగా..

Romantic Trailer: ఏం చేసినా ఇప్పుడే.. చేయు లేదా చచ్చిపో.. రొమాంటిక్‌ కొత్త ట్రైలర్‌ చూశారా.? మాములుగా లేదుగా..