AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌లో ప్రియ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.? ఏడు వారాలకు ఏకంగా..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. వారం వారం ఒక్కో కంటెస్టెంట్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌లో ప్రియ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.? ఏడు వారాలకు ఏకంగా..
Biggboss Fame Priya
Narender Vaitla
| Edited By: Phani CH|

Updated on: Oct 26, 2021 | 7:02 AM

Share

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. వారం వారం ఒక్కో కంటెస్టెంట్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సీనియర్‌ ఆర్టిస్ట్‌ ప్రియ కూడా హౌజ్‌ నుంచి నిష్క్రమించారు. హౌజ్‌లో ఉన్నన్ని రోజులు తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్న ప్రియ ఎట్టకేలకు ఎలిమినేట్‌ కావాల్సి వచ్చింది.

ఇక ప్రియ ఎలిమినేషన్‌కు తన కోపమే కారణమనే చర్చ జరుగుతోంది. ముందు నుంచి ఓటింగ్ లిస్ట్‏లో టాప్ లో ఉన్న ప్రియ.. ఉన్నట్టుండి ఏడోవారం ఎలిమినేట్ అయ్యింది. హౌజ్‌మేట్స్‌తో పదే పదే గొడవలకు దిగడమే ఆమెకు నెగిటివ్‌గా మారిందని సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే ఏడు వారాలు హౌజ్‌లో ఉన్న ప్రియ ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుందన్న దానికి సంబంధించి కూడా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సినిమాలు, సీరియళ్లలో నటిస్తోన్న ప్రియకు బిగ్‌బాస్‌ భారీగానే ముట్టజెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రియకు ఒక్క వారానికి రూ. 1.5 లక్ష రెమ్యునరేషన్‌ ఇచ్చినట్లు టాక్‌.

అంటే ఈ లెక్కన ఏడు వారాలు హౌజ్‌లో ఉన్న ఈ సీనియర్‌ యాక్టర్‌ రూ. 10 లక్షలకుపైగానే రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి తన రెమ్యునరేషన్‌పై వస్తోన్న వార్తల విషయంలో ప్రియ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read: IPL New Teams Auction: కార్పోరేట్ల చేతుల్లోకి ఇండియన్ ప్రీమియర్ లీగ్.. లక్నో, అహ్మాదాబాద్ టీంల ఎంట్రీతో మారిన సీన్..!

Mani Sharma Son Marriage: అట్టహాసంగా సింగర్‌ను వివాహమాడిన మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్

Freshers Party: ఇదెక్కడి స్వాగతం సామీ.. ఇలా కూడా వెల్‌కమ్ చెబుతారా?.. ఆ యూనివర్సిటీలో ప్రెషర్స్ పార్టీ స్టైలే వేరు..!