IPL New Teams Auction: కార్పోరేట్ల చేతుల్లోకి ఇండియన్ ప్రీమియర్ లీగ్.. లక్నో, అహ్మాదాబాద్ టీంల ఎంట్రీతో మారిన సీన్..!

IPL 2022: మొత్తం 22 వ్యాపార సంస్థలు ఈ రెండు జట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపాయి. ఇప్పటికే ఐపీఎల్‌లో అంబానీ, షారుక్ ఖాన్, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్, ప్రీతి జింతా, కళానిది మారన్ యజమానులుగా ఉన్నారు. అయితే వీరిలో..

IPL New Teams Auction: కార్పోరేట్ల చేతుల్లోకి ఇండియన్ ప్రీమియర్ లీగ్.. లక్నో, అహ్మాదాబాద్ టీంల ఎంట్రీతో మారిన సీన్..!
Ipl 2022 New Franchises Ahmedabad & Lucknow
Follow us
Venkata Chari

|

Updated on: Oct 25, 2021 | 9:19 PM

IPL New Teams Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కి సంబంధించి రెండు కొత్త జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్‌పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ లక్నో టీంను రూ .7,090 కోట్లకు కొనుగోలు చేసింది. అదే సమయంలో సీవీసీ క్యాపిటల్ అహ్మదాబాద్ బృందాన్ని రూ .5600 కోట్లకు కొనుగోలు చేసింది. బీసీసీఐ రెండు జట్ల నుంచి సుమారు రూ. 12 వేల కోట్లు ఆర్జించనుంది. ఇది ఊహించిన దాని కంటే చాలా ఎక్కువ లాభాలు అందించింది.

మొత్తం 22 వ్యాపార సంస్థలు ఈ రెండు జట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపాయి. బిడ్డర్లలో అదానీ గ్రూప్, గ్లేజర్ కుటుంబం, ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్, టొరెంట్ ఫార్మా, అరబిందో ఫార్మా, ఆర్‌పి-సంజీవ్ గోయెంకా గ్రూప్, హిందుస్థాన్ టైమ్స్ మీడియా గ్రూప్, మాజీ మంత్రి నవీన్ జిందాల్ జిందాల్ స్టీల్, రోనీ స్క్రూవాలా, ముగ్గురు ప్రైవేట్ ఈక్విటీ భాగస్వాములు ఉన్నారు. ప్రజలు పాల్గొన్నారు. కానీ, చివరికి గోయెంకా గ్రూప్, సీవీసీ గ్రూపు విజయం సాధించగలిగాయి.

కార్పోరేట్ల చేతుల్లోకి ఐపీఎల్ లీగ్.. కాగా, ఇప్పటికే ఐపీఎల్‌లో అంబానీ, షారుక్ ఖాన్, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్, ప్రీతి జింతా, కళానిది మారన్ యజమానులుగా ఉన్నారు. అయితే వీరిలో ఒక్క షారుక్ ఖాన్, ప్రీతి జింతా తప్ప మిగిలిన అందరూ కార్పొరేట్లు కావడం విశేషం. టోటల్ గా ఐపీఎల్ లీగ్ మొత్తం దాదాపు కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లినట్లయింది.

భారత క్రికెట్.. ఐపీఎల్‌లో రెండు కొత్త జట్ల చేరడంపై, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ- భారత క్రికెట్ పురోగమిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదే మాకు ముఖ్యం. మేము భారత క్రికెట్‌ని డెవలప్ చేసేందుకే ప్రయత్నిస్తాం. అది మా పని. భారత క్రికెట్‌ ఎంత గొప్పగా ఉంటే అంత మంచిదని’ అని పేర్కొన్నారు.

ఆర్‌పీఎస్ కెప్టెన్‌గా 2016లో ఎంఎస్ ధోనీ.. 2016-17లో ఐపీఎల్‌లో ఆడిన పూణెకు చెందిన ఆర్‌పీ-సంజీవ్ గోయింకా గ్రూప్ జట్టు 6 బిలియన్ యూఎస్ డాలర్ల ఆస్తిని కలిగి ఉంది. ఈ గ్రూప్ ఎనర్జీ, కార్బన్ బ్లాక్ మాన్యుఫ్యాక్చరింగ్, రిటైల్, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, ఎఫ్‌ఎంసీబీ, మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్, అగ్రికల్చర్ వ్యాపారంలో పాల్గొంటుంది. 2016 లో ఈ బృందం రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌ను కొనుగోలు చేసింది. రఘు అయ్యర్‌ను సీఈఓగా నియమించారు. IPL 2016 సీజన్‌లో జట్టు ప్రదర్శన పేలవంగా ఉంది. ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో జట్టు విఫలమైంది. అయితే, 2017 సీజన్‌లో ఈ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఐపీఎల్ 2017 ఫైనల్లో, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌ని ముంబై ఇండియన్స్ 1 పరుగు తేడాతో ఓడించింది.

RPSG గ్రూప్ గతంలో రైజింగ్ పూణే సూపర్‌జెయింట్ (2016, 2017) జట్టును కలిగి ఉంది. ఇది సీఎస్‌కే, రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్‌ నుంచి నిషేధంలో ఉన్నప్పుడు రెండు సీజన్‌లలో ఆడింది. ఆర్‌పీఎస్‌జీ కంపెనీ లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో తమ లీగ్ మ్యాచులను ఆడునున్నారు. ఇది వీరి సొంత స్టేడియంగా మారనుంది. ఇది నవంబర్ 2018లో ప్రేక్షకుల కోసం ఓపెన్ చేశారు. ఇందులో దాదాపు 50,000 ప్రేక్షకులకు సీటింగ్ సామర్థ్యం ఉంది.

CVC క్యాపిటల్స్ అనేది యూరప్, ఆసియా, అమెరికా అంతటా కార్యాలయాలతో కూడిన అంతర్జాతీయ కంపెనీ. సీవీసీ క్యాపిటల్స్ ఫార్ములా 1లో ఇంతకుముందు వాటాదారులుగా ఉన్నారు. ఇటీవల స్పెయిన్‌లోని టాప్-ఫ్లైట్ ఫుట్‌బాల్ లీగ్ లా లిగాలో కొంత వాటాను తీసుకున్నారు. అయితే సీవీసీ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం, నరేంద్ర మోడీ స్టేడియంలో తమ కేంద్రంగా చేసుకోనున్నారు. ఈ స్టేడియం సామర్థ్యం 132,000 లుగా ఉంది.

వచ్చే సీజన్ నుంచి జట్ల సంఖ్య 10కి పెరిగింది. ఐపీఎల్‌లో మ్యాచ్‌ల సంఖ్య కూడా 60 నుంచి 74కి పెరగనుంది. ఆటగాళ్ల పరంగా మాట్లాడితే, రెండు జట్ల పెరుగుదలతో, కనీసం 45 నుండి 50 మంది కొత్త ఆటగాళ్లకు ఐపిఎల్‌లో ఆడే అవకాశం లభిస్తుంది. వీరిలో 30 నుంచి 35 మంది భారత యువ ఆటగాళ్లు ఉంటారు.

టీంలు వాటి యజమానులు.. టీం: చెన్నై సూపర్ కింగ్స్ నగరం: చెన్నై, తమిళనాడు హోమ్ గ్రౌండ్: ఎంఏ చిదంబరం స్టేడియం యజమాని: ఎన్. శ్రీనివాసన్

టీం: ఢిల్లీ క్యాపిటల్స్ నగరం: న్యూఢిల్లీ హోమ్ గ్రౌండ్: అరుణ్ జైట్లీ స్టేడియం యజమానులు: గ్రంధి మల్లికార్జున రావు సజ్జన్ జిందాల్

టీం: కోల్‌కతా నైట్ రైడర్స్ నగరం: కోల్‌కతా , పశ్చిమ బెంగాల్ హోమ్ గ్రౌండ్: ఈడెన్ గార్డెన్స్ యజమానులు: షారుఖ్ ఖాన్, జై మెహతా

టీం: ముంబై ఇండియన్స్ నగరం: ముంబై , మహారాష్ట్ర హోమ్ గ్రౌండ్: వాంఖడే స్టేడియం యజమానులు: ముఖేష్ అంబానీ

టీం: పంజాబ్ కింగ్స్ నగరం: మొహాలి , పంజాబ్ హోమ్ గ్రౌండ్: PCA స్టేడియం, మొహాలి యజమానులు: మోహిత్ బర్మన్, నెస్ వాడియా, ప్రీతి జింటా, కరణ్ పాల్

టీం: రాజస్థాన్ రాయల్స్ నగరం: జైపూర్ , రాజస్థాన్ హోమ్ గ్రౌండ్: సవాయ్ మాన్సింగ్ స్టేడియం యజమానులు: మనోజ్ బడాలే, లచ్లాన్ ముర్డోక్, గెర్రీ కార్డినాలే

టీం: సన్‌రైజర్స్ హైదరాబాద్ నగరం: హైదరాబాద్ , తెలంగాణ హోమ్ గ్రౌండ్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం యజమానులు: కళానిధి మారన్

టీం: లక్నో నగరం: లక్నో , ఉత్తర ప్రదేశ్ హోమ్ గ్రౌండ్: భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియం యజమానులు: RPSG గ్రూప్

టీం: అహ్మదాబాద్ నగరం: అహ్మదాబాద్ , గుజరాత్ హోమ్ గ్రౌండ్: నరేంద్ర మోడీ స్టేడియం యజమానులు: CVC క్యాపిటల్ గ్రూపు

Also Read: IPL New Teams Auction: ఉత్కంఠకు తెరదించిన బీసీసీఐ.. కొత్తగా ఐపీఎల్‌ 2022లో చేరే టీంలు ఇవే..!

Ind Vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. ఐదేళ్ల క్రితం ధోని ఏం చెప్పాడో ఇప్పుడు అచ్చు అలాగే జరిగింది..

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!