Ind Vs Pak: మహ్మద్ షమీ నీకు మద్దతు.. సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫైర్..
టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఓటమిపై రగడ కొనసాగుతోంది. టీమిండియా ఓటమికి బౌలర్ మహ్మద్ షమీనే కారణమంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఓటమిపై రగడ కొనసాగుతోంది. టీమిండియా ఓటమికి బౌలర్ మహ్మద్ షమీనే కారణమంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. టీ 20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ పది వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత, సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఆటగాళ్లపై వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజలు కూడా టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీని టార్గెట్ చేశారు. అతనిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో సోషల్ మీడియాలో టార్గెట్ చేసిన తర్వాత షమీకి మాజీ ఆటగాళ్లతోపాటు, ప్రస్తుత క్రికెటర్లు మద్దతు పలికారు. మరో వైపు రాజకీయ నాయకులు కూడా వెన్నంటి నిలుస్తున్నారు. ఇందులో ముందు వరుసలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతోపాటు ఒవైసీ నిలిచారు. చాలా మంది మహమ్మద్ షమీకి మద్దతు ఇచ్చారు. మహ్మద్ షమీ మేమంతా మీ వెంటే ఉన్నామని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
Mohammad #Shami we are all with you.
These people are filled with hate because nobody gives them any love. Forgive them.
— Rahul Gandhi (@RahulGandhi) October 25, 2021
సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. టీమిండియాలో 11 మంది ప్లేయర్లు ఉండగా.. ఒక్క షమీని మాత్రమే ఓటమికి ఎందుకు బాధ్యుడ్ని చేస్తున్నారని ప్రశ్నించారు. దీనికి బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారాయన.
हार-जीत होती रहती है, लेकिन कल के मैच को लेकर जिस तरह से @MdShami11 को निशाना बनाया जा रहा है, वह मुसलमानों के प्रति नफ़रत और कट्टरता को दर्शाता है। क्या @BJP4India सरकार इसकी निंदा करेगी? #Shami pic.twitter.com/E62Z7CnSDx
— Asaduddin Owaisi (@asadowaisi) October 25, 2021
సచిన్, సెహ్వాగ్ సహా పలువురు మాజీలు..
అంతకుముందు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌తో సహా మాజీ, ప్రస్తుత భారత ఆటగాళ్ళు పేసర్ మహమ్మద్ షమీకి మద్దతు ఇచ్చారు. టీ 20 ప్రపంచకప్‌లో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో 3.5 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చాడు షమీ. సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ చేశారు. మేము టీమిండియాకు మద్దతు ఇచ్చినప్పుడు.. ఒకరికాదు.. జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి వ్యక్తికి మా మద్దతు ఉంటుంది. మహమ్మద్ షమీ నిబద్ధత కలిగిన ప్రపంచ స్థాయి బౌలర్.. ఇది అతనికి మంచి రోజు కాదు.. అది ఏ ఆటగాడికైనా జరగవచ్చు. నేను షమీ టీమిండియాతో ఉన్నాను.
When we support #TeamIndia, we support every person who represents Team India. @MdShami11 is a committed, world-class bowler. He had an off day like any other sportsperson can have.
I stand behind Shami & Team India.
— Sachin Tendulkar (@sachin_rt) October 25, 2021
సోషల్ మీడియాలో మహమ్మద్ షమీని టార్గెట్ చేయడం షాకింగ్‌గా ఉందని, మేము అతనితో ఉన్నామని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. అతను ఛాంపియన్ మరియు భారతదేశం క్యాప్ ధరించే వ్యక్తి తన హృదయంలో భారతదేశాన్ని ఏ ఆన్‌లైన్ అల్లర్ల కంటే ఎక్కువగా కలిగి ఉంటాడు. నేను నీతో ఉన్నాను షమీ.
ఇవి కూడా చదవండి: Amit Shah: జమ్ము కశ్మీర్‌లో అమిత్ షా సాహస నిర్ణయం.. బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ తొలిగింపు..
Ind Vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. ఐదేళ్ల క్రితం ధోని ఏం చెప్పాడో ఇప్పుడు అచ్చు అలాగే జరిగింది..