AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah: జమ్ము కశ్మీర్‌లో అమిత్ షా సాహస నిర్ణయం.. బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ తొలిగింపు..

ఈ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ తొలిగించండి.. లోయలోని ప్రజలతో నేరుగా మాట్లాడుతాం.. అంటూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. జమ్ము కశ్మీర్‌లో మూడు రోజుల పర్యటన సందర్భంగా..

Amit Shah: జమ్ము కశ్మీర్‌లో అమిత్ షా సాహస నిర్ణయం.. బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ తొలిగింపు..
Home Minister Amit Shah Get
Sanjay Kasula
|

Updated on: Oct 25, 2021 | 8:04 PM

Share

ఈ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ తొలిగించండి.. లోయలోని ప్రజలతో నేరుగా మాట్లాడుతాం.. అంటూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. జమ్ము కశ్మీర్‌లో మూడు రోజుల పర్యటనలో ఉన్న హోంమంత్రి అమిత్ షా సోమవారం శ్రీనగర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించే ముందు సెక్యూరిటీ అధికారులను ఇలా అదేశించారు. దీంతో అప్పటి వరకు ప్రసంగించే స్థలంలో ఏర్పాటు చేసిన  బుల్లెట్ ప్రూఫ్ గాజు షీల్డ్‌ను తొలిగించారు. మీరందరూ మీ హృదయంలో ఉన్న భయాన్ని.. తొలగించుకోవాలని అన్నారు. శాంతి, అభివృద్ధి ప్రయాణానికి ఇకపై అంతరాయం కలిగించదు. ప్రతిపక్షాలను హేళన చేస్తూ కొన్ని కామెంట్స్ చేశారు.. బుల్లెట్లకు భయపడకుండా తాను కశ్మీర్‌లో పర్యటించినట్టు తెలిపారు. స్టేజ్‌ మీద కూడా బుల్లెట్‌ ప్రూఫ్‌ గ్లాస్‌ను తీసేయాలని చెప్పినట్టు తెలిపారు. కశ్మీర్‌ సమస్యపై పాకిస్తాన్‌తో చర్చలు జరపాలని మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా అంటున్నారని , దీనికి తాము అంగీకరించడం లేదన్నారు. కశ్మీర్‌ సమస్యలపై కశ్మీర్‌ ప్రజల తోనే ఎన్నిసార్లు చర్చలు జరపడానికైనా కేంద్రం సిద్దంగా ఉందన్నారు.

నిజానికి అమిత్ షా మూడు రోజుల జమ్మూ కాశ్మీర్ పర్యటనకు ఈరోజు చివరి రోజు. ఈ సందర్భంగా శ్రీనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

ఇక్కడి కొందరు నాయకులు నన్ను నిందించారని అమిత్ షా అన్నారు. “ఈ రోజు నేను మీతో ముక్తసరిగా మాట్లాడాలనుకుంటున్నాను. అందుకే ఇక్కడ బుల్లెట్‌ప్రూఫ్ షీల్డ్ లేదా భద్రత అవసరం లేదు.. ఫరూక్ సాహబ్ నన్ను పాకిస్తాన్‌తో మాట్లాడమని సూచించారు. అయితే నేను మాట్లాడుతాను పాకిస్తాన్‌తో కాదు లోయలోని ప్రజలతో మాట్లాడుతాను.” అంటూ షా తనదైన తరహాలో అన్నారు.

ఈ రోజు మీ చేతుల్లో రాళ్లు పట్టుకోండని చెప్పినవారు. మీకు ఏం మంచి చేసారో చెప్పాలని కశ్మీర్ యువతను ఆయన ప్రశ్నించారు. లోయలోని యువతను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. POK మీ దగ్గర ఉంది. మీ వద్ద ఇప్పుడు ఆయుధాలు, రాళ్లు ఉన్నాయి.. మీ గ్రామానికి విద్యుత్ ఉందా..? ఆసుపత్రి ఉందా..? మెడికల్ కాలేజీ ఉందా..? కనీసం తాగేందుకు మంచి నీరు ఉందా..? మహిళలకు మరుగుదొడ్లు ఉన్నాయా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అక్కడ ఏమీ జరగలేదు.. ఈ వ్యక్తులు పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నారు.  

అయితే.. ఆగస్టు 5న ఇంటర్నెట్‌ బంద్‌కు సంబంధించి అమిత్‌ షా మాట్లాడుతూ.. ఇంటర్నెట్‌ బంద్‌ చేయకుంటే.. యువతను రెచ్చగొట్టి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేలా చేసేవారని.. కశ్మీర్ ప్రజలు ఇక భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రధాని మోడీ గుండెల్లో కశ్మీర్ ఉంది.. కాబట్టి ఇక్కడి అభివృద్ధికి విఘాతం కలిగించే వారు విజయం సాధించలేరు.  

ఇవి కూడా చదవండి: Madhavan: కొడుకును ఇలా పెంచాలి.. మాధవన్ కొడుకుపై ప్రముఖుల ప్రశంసలు.. ఎందుకో తెలుసా..

PF Withdraw: కేవలం గంటలో పీఎఫ్ ఉపసంహరించుకోవచ్చు.. ఎలా చేసుకోవాలో తెలుసా..