AP Education: ఉన్నత విద్యపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష.. యూనివర్సిటీల్లో టీచింగ్‌ స్టాప్‌ భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో

AP Education: ఉన్నత విద్యపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష.. యూనివర్సిటీల్లో టీచింగ్‌ స్టాప్‌ భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌
Cm Ys Jagan
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 25, 2021 | 9:44 PM

AP CM YS Jagan: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్ధాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే.. 3 సంవత్సరాలలో యూనివర్సిటీలు బాగుచేయాలని, క్యాంపస్ లలో అన్ని రకాలుగా ప్రమాణాలు మెరుగు పర్చేందుకు కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశాలిచ్చారు. ఇంకా ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల వివరాలు ఇలా ఉన్నాయి.

యూనివర్సిటీల్లో టీచింగ్‌ స్టాప్‌ భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ప్రతివారం ఒక్కో వైస్‌ ఛాన్సలర్‌తో ఉన్నత విద్యామండలి సమావేశం తర్వాత నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు వీటి పరిష్కారంపై ప్రణాళికలు, చర్యలు నాణ్యమైన బోధన, ఉపాధి కల్పనే లక్ష్యం ప్రతి నియోజకవర్గంలో తప్పనిసరిగా డిగ్రీ కాలేజీ ఏర్పాటు

విశ్వవిద్యాలయాల్లో టీచింగ్‌ స్టాప్‌ను పూర్తిగా భర్తీ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆమోదం టీచింగ్‌ స్టాఫ్‌ లేనప్పుడు యూనివర్సిటీలు ఉన్నా.. లాభం ఏమిటి? మంచి అర్హతా ప్రమాణాలు కలిగినవారిని నియమించాలన్న సీఎం క్వాలిటీ లేకపోతే… రిక్రూట్‌ చేసినా అర్ధం ఉండదు నియామకాల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలి అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపట్టాలన్న సీఎం రిక్రూట్‌మెంట్‌లో పక్షపాతాలకు తావుండకూడదన్న సీఎం కరిక్యులమ్‌లో కూడా మార్పులు రావాలన్న సీఎం అప్పుడే నాణ్యమైన విద్య అందించగలుగుతాం విద్యా ప్రమాణాలు కూడా మెరుగుపడతాయన్న సీఎం ఈ మూడు అంశాల్లో మార్పు వచ్చినప్పుడు మంచి ఫలితాలు వస్తాయన్న సీఎం

పిల్లలకిచ్చే ఆస్తి– నాణ్యమైన విద్య పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు అదీ నాణ్యతతో కూడిన విద్య మాత్రమే మనం వచ్చిన తర్వాత విద్యారంగంలో తేడా ఏంటి అన్నది కనిపించాలి ఈ ప్రభుత్వం చదువుకు ఇచ్చిన ప్రాధాన్యత మరే ప్రభుత్వమూ ఇవ్వలేదు నాణ్యమైన విద్య అందించడానికి అనేక చర్యలు తీసుకున్నాం మంచి చదువులతో కుటుంబాల తలరాతలు మారుతాయి

కాలేజీల్లో ప్రమాణాలు తప్పనిసరి… యూనివర్సిటీల్లో ఇంటర్నెట్‌ సదుపాయం పూర్తిస్ధాయిలో ఉండేలా చూసుకోవాలన్న సీఎం మంచి బ్యాండ్‌ విడ్త్‌ క్వాలిటీ ఉండేలా చూసుకోవాలి : ప్రమాణాలు పాటించని కాలేజీలపై రాజీ పడొద్దు : సీఎం ప్రతి కాలేజీ కచ్చితంగా ప్రమాణాలు పాటించాల్సిందే : కాలేజీలు సరిగ్గా లేకపోతే… యూనివర్సిటీల ప్రతిష్ట దెబ్బతింటుంది : ఏ కాలేజీలోనైనా ప్రమాణాలు లేకపోతే.. గుర్తించిన అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లి… మెరుగుపరుచుకోవడానికి సమయం ఇవ్వండి

ప్రమాణాలు లేనివాటికి అనుమతులు ఇవ్వొద్దు

అలాగే సబ్‌రిజిస్ట్రార్, టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల్లో పారదర్శకత, పౌరులకు మెరుగైన సేవలు అందించడంపైన అధ్యయనం చేయాలన్న సీఎం యూనివర్సిటీల్లో అత్యుత్తమ అధ్యాపకుల క్లాసులను రికార్డ్‌ చేయాలన్న సీఎం సబ్జెక్టుల వారీగా ఇలా రికార్డ్‌ చేసి, ఆన్‌లైన్ల్‌ పెట్టాలన్న సీఎం విద్యార్ధులు సులభంగా అర్ధం చేసుకోవడానికి ఈ వీడియోలు ఉపయోగపడతాయన్న సీఎం ప్రతి వీసీ కూడా తన హయాంలో మంచి మార్పులు తీసుకురావాలి ఉద్యోగాల కల్పన దిశగా చదువులు ఉండాలి మైక్రోసాప్ట్‌ లాంటి సంస్ధలతో శిక్షణ నిరంతరం కొనసాగాలి కోర్సులలో శిక్షణను ఇంటిగ్రేట్‌ చేయాలి అప్పుడే ఉద్యోగావకాశాలు మరింతగా మెరుగుపడతాయి ఈ ప్రభుత్వం వచ్చాక ఉన్నత విద్యలో అనేక మార్పులు తీసుకొచ్చాం జాబ్‌ ఓరియెంటెడ్‌గా మన కోర్సులను తీర్చిదిద్దాలి విద్యార్ధి విశ్వవిద్యాలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు కచ్చితంగా ఉద్యోగం సాధించేలా ఉండాలి మంచి చదువులున్నా ఇంటర్వూల దగ్గరకు వచ్చేసరికి విఫలం అవుతున్న పరిస్థితులు చూస్తున్నాం అప్రెంటిస్‌షిప్‌ కచ్చితంగా ఉండాలి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని తీసుకువస్తున్నాం జిల్లా కలెక్టర్‌తో సమన్వయం చేసుకుని నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను, కాలేజీలను అనుసంధానం చేయాలి

అత్యుత్తమ కరిక్యులమ్‌… సర్టిఫైడ్‌ కోర్సులనూ కరిక్యులమ్‌లో భాగంగా చేయాలన్న సీఎం ఉగ్యోగాల కల్పన, ఉపాధి అన్నది లక్ష్యం కావాలి ఆయా రంగాల్లో నిపుణులైన, అత్యుత్తమమైన వ్యక్తులతో కోర్సులను రూపొందించండి బైలింగువల్‌ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టాలి నాలుగేళ్లపాటు ఇంగ్లిషు, తెలుగు మాధ్యమాల్లో పాఠ్యపుస్తకాలు ఉండాలి చదువులు అయిపోయిన తర్వాత కచ్చితంగా జాబ్‌ వస్తుందనే విశ్వాసం, నమ్మకం ఉండాలి క్వాలిటీ ఎడ్యుకేషన్‌ కోసం పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకురావాలి ప్రాక్టికాలిటీకి పెద్ద పీట వేయాలి: అధికారులు సీఎం ఆదేశం

జాతీయ స్ధాయి ప్రమాణాలు జీఈఆర్‌ రేషియోను 2025 నాటికల్లా 70 శాతం అందుకోవాలి విద్యాదీవెన, వసతి దీవెనలాంటి పథకాలతో కచ్చితంగా దీన్ని అందుకుంటాం ఆస్పత్రులను జాతీయ స్ధాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నాం అలాగే ప్రతి యూనివర్శిటీ పరిధిలో కూడా జాతీయ ప్రమాణాలు ఉండాలి కాలేజీలన్నీ ఆయా ప్రమాణాలు పాటించేలా చూడాలి దీనికోసం సరైన లక్ష్యాలను నిర్దేశించండి : అధికారులకు సీఎం ఆదేశం దీనికి అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటుచేయండి

సమస్యలున్నా.. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎన్ని సమస్యలున్నా సరే… ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో ఎక్కడా లోటు చేయడం లేదు ప్రతి మూడు నెలలకొకసారి కచ్చితంగా చెల్లింపులు చేస్తున్నాం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోవడం వల్ల సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నామనే మాట యాజమాన్యాల నుంచి రాకుండా చూసుకుంటున్నాం తల్లుల అక్కౌంట్లోకి నేరుగా డబ్బులు వేస్తున్నాం కాలేజీల్లో పరిస్థితులపై నేరుగా వారు ప్రశ్నిస్తున్నారు

యూనివర్సిటీకి సంబంధించిన ప్రభుత్వ కాలేజీల్లో కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇతర ప్రయివేటు కాలేజీల్లానే సమానంగా ఫీజులు చెల్లిస్తాం దీనివల్ల ఆర్ధికంగా యూనివర్సిటీలు స్వయం సమృద్ధి సాధిస్తాయి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఇదివరకే ఆదేశాలు ఇచ్చాం

కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలను తీసుకువస్తున్నాం ఆ కాలేజీలను స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటున్నాం పరిశోధనల మీద కూడా కొలాబరేట్‌ చేసుకోవాలి జిల్లాల్లో పరిశ్రమలతో అనుసంధానం చేసుకోవాలి ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో రంగానికి సంబంధించి పరిశోధనలు జరిగేలా పరిశ్రమలతో కొలాబరేట్‌ కావాలి

యూనివర్సిటీలు – మూడేళ్ల కార్యాచరణ ప్రతివారం ఒక వీసీతో సమావేశం కావాలి : యూనివర్సిటీల్లో సమస్యలు, ప్రభుత్వ పరంగా అందించాల్సిన తోడ్పాటుపై కలిసి కూర్చుని చర్చించాలి : ఉన్నత విద్యా మండలికి సీఎం ఆదేశం ఆ సమావేశంలో గుర్తించిన అంశాలను తన దృష్టికి తీసుకురావాలన్న సీఎం ఇలా రాష్ట్రంలో ప్రతి యూనివర్సిటీ వీసీతో కలసి విడివిడిగా సమావేశాలు నిర్వహించాలన్న సీఎం ప్రస్తుతం ఉన్న స్ధాయి, మెరుగుపర్చుకోవాల్సిన ప్రమాణాలను గుర్తించాలన్న సీఎం తర్వాత యూనివర్సిటీల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్న సీఎం వచ్చే మూడేళ్ల కాలానికి కార్యాచరణ రూపొందించాలన్న సీఎం మూడేళ్లలో ఈ విజన్‌ అందుకోవాలన్న సీఎం అన్ని యూనివర్సిటీల్లో నాక్‌ రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ కావాలి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను యూనివర్సిటీలతో ఇంటిగ్రేట్‌ చేయాలి అంతర్జాతీయంగా, జాతీయంగా పేరున్న కంపెనీలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటాయి ఆన్‌లైన్‌లో కూడా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులను ఉంచాలన్న సీఎం ఇంగ్లిషును మెరుగుపర్చడంపైనా దృష్టిపెట్టాలన్న సీఎం బేసిక్‌ ఇంగ్లిషు అన్నది తప్పనిసరి సబ్జెక్టుగా పెట్టాలన్న సీఎం దీనివల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్న సీఎం

డిగ్రీ కళాశాలలుపైనా సీఎం సమీక్ష డిగ్రీ కళాశాలను కూడా ఒక విధానం ప్రకారం ఏర్పాటు చేయాలి ఒక అసెంబ్లీ నియోజక వర్గానికి ఒక డిగ్రీ కళాశాల ఉండాలన్న సీఎం

ఎయిడెడ్‌ విద్యాసంస్ధల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదు  సీఎం స్పష్టీకరణ ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తి స్వచ్ఛందం చాలా విద్యాసంస్ధల్లో పరిస్థితులు దెబ్బతిన్నాయి శిధిలావస్ధలో, మౌలికసదుపాయాలు లేక విద్యార్ధులు, సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి వారికి ఒక అవకాశం ప్రభుత్వ పరంగా కల్పించాం ప్రభుత్వానికి అప్పగిస్తే…. ఆయా సంస్ధలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది మెరుగైన రీతిలో వాటిని నడుపుతుంది దాతల పేర్లు కూడా కొనసాగుతాయి లేదు తామే నడుపుకుంటామంటే భేషుగ్గా నడుపుకోవచ్చు దీనికి ఎలాంటి అభ్యంతరం లేదు ప్రభుత్వానికి ఎయిడెడ్‌ విద్యాసంస్ధల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదని అందరికీ స్పష్టం చేయాలి

సమీక్ష సమావేశంలో భాగంగా ఇంగ్లిషు కమ్యూనికేషన్‌ వర్క్‌బుక్, టెక్ట్స్‌బుక్స్‌తో పాటు, ఏపీఎస్‌సీహెచ్‌ఈ పాడ్‌కాస్ట్‌ను సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఆవిష్కరించారు. ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీష్‌ చంద్ర, ఏపీఎస్‌సీహెచ్‌ఈ ఛైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్, వివిధ విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.