Rainbow Python video: ఏడు రంగుల కొండచిలువను ఎప్పుడైనా చూసారా..! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
హరివిల్లు చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అందరికీ తెలిసిందే.. దీనికి కారణం ఇంద్రధనస్సులోని ఏడు రంగులు. మరి ఆకాశంలో అరుదుగా కనిపించే ఆ ఇంద్రధనుస్సులోని రంగులు ఒక పాములో కనిపిస్తే.. అదీ ఒక భయంకరమైన కొండచిలువలో ...
హరివిల్లు చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అందరికీ తెలిసిందే.. దీనికి కారణం ఇంద్రధనస్సులోని ఏడు రంగులు. మరి ఆకాశంలో అరుదుగా కనిపించే ఆ ఇంద్రధనుస్సులోని రంగులు ఒక పాములో కనిపిస్తే.. అదీ ఒక భయంకరమైన కొండచిలువలో … ఓ వైపు భయం వేసినా.. పాముని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది కదా…. అలాంటి రెయిన్ బో పైథాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ అరుదైన రంగురంగుల మైలవ్ అనే పాము కాలిఫోర్నియాలోని ఫౌంటెన్ వ్యాలీలోని ది రిపైల్ జూలో జన్మించింది. జూ యజమాని జే బ్రూవర్ ఈ పైథాన్‌తో ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అరుదైన రంగురంగుల పాముతో తాను ఉన్న వీడియో షేర్ చేసి.. దీనికంటే గొప్పది ఏదీలేదని కాప్షన్ కూడా జత చేశారు. జే బ్రూవర్ తనకు పాములంటే చాలా ఇష్టమని చెప్పాడు. గత 50 ఏళ్లుగా తాను పాములను పట్టుకునే పనిలో ఉన్నానని, పాములను సొంత పిల్లలలాగే చూసుకుంటానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు జంతువుల పట్ల ప్రజల వైఖరి మారాలని జే బ్రూవర్ కోరుకుంటున్నాడు.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

