Corona Virus: కరోనాతో చైనా గజగజ..! మళ్ళీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. పలు నగరాల్లో లాక్ డౌన్.. (వీడియో)

కరోనా వైరస్‌ను ప్రపంచ దేశాల మీదకు వదిలిన చైనా అదే వైరస్‌ను ఎలా అదుపు చేయాలో తెలియక సతమతమవుతోంది. కరోనా మహమ్మారి అక్కడ ఇంకా భయంకరంగా ఉంది. పలు నగరాలు, పట్టణాలలో వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే చాలా నగరాలలో వైరస్‌ విజృంభణ మొదలయ్యింది.

Corona  Virus: కరోనాతో చైనా గజగజ..! మళ్ళీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. పలు నగరాల్లో లాక్ డౌన్.. (వీడియో)

|

Updated on: Oct 26, 2021 | 4:20 PM

కరోనా వైరస్‌ను ప్రపంచ దేశాల మీదకు వదిలిన చైనా అదే వైరస్‌ను ఎలా అదుపు చేయాలో తెలియక సతమతమవుతోంది. కరోనా మహమ్మారి అక్కడ ఇంకా భయంకరంగా ఉంది. పలు నగరాలు, పట్టణాలలో వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే చాలా నగరాలలో వైరస్‌ విజృంభణ మొదలయ్యింది. ఒక్క కేసు నమోదైతేనే వణికిపోయే చైనా ఇన్నేసి కేసులు వెలుగులోకి రావడంతో అలెర్టయ్యింది. ఎందుకైనా మంచిదని స్కూళ్లు మూసేసింది. విమానాలను రద్దు చేసింది. కోవిడ్‌ పరీక్షల కేంద్రాలను పెంచేసింది. అనుమానం కలిగిన ప్రతి ఒక్కరికి పరీక్షలు చేస్తోంది. మొన్న షాంఘై నుంచి షియాన్‌, గున్సూ, ఇన్నర్‌ మంగోలియా ప్రావిన్స్‌లలో ఓ వృద్ధ జంట పర్యటించింది. వారిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే పరీక్షలు చేశారు. కోవిడ్‌ నిర్ధారణ అయ్యింది.
అప్పట్నుంచి వారి కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ను చేపట్టారు అధికారులు. వారితో ఎవరెవరు సన్నిహితంగా మెలిగారో వారందరికీ పరీక్షలు చేశారు. పదుల సంఖ్యలో కేసులు వెలుగు చూశాయి. కేవలం గురువారం ఒక్క రోజే 13 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రావిన్స్‌లల్లో కోవిడ్‌ పరీక్షలు జరుపుతున్నారు. కోవిడ్‌ కేసులు బయటపడిన ప్రదేశాలలో టూరిస్ట్‌ సెంటర్లను, స్కూళ్లను క్లోజ్‌ చేశారు. థియేటర్లను బంద్‌ పెట్టారు. వేడుకలను నిషేధించారు.

స్థానికంగా లాక్‌డౌన్ విధించారు. సుమారు 40 లక్షల జనాభా ఉన్న లాన్‌జువో ప్రావిన్స్‌తో పాటు సమీప ప్రాంతాల ప్రజలను అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని హెచ్చరించారంటే పరిస్థితి కాస్త తీవ్రంగానే ఉందని అర్థమవుతోంది. నెగటివ్‌ రిపోర్ట్‌ ఉన్న వారిని మాత్రమే బయటకు రానిస్తున్నారు. అది కూడా అత్యవసరమైన పనులుంటేనే! ఇన్నర్‌ మంగోలియాలోని పలు ప్రాంతాల్లో నగరం నుంచి రాకపోకలను నిషేధించారు. విమాన సేవలను కూడా రద్దు చేశారు. షియాన్‌, లాన్‌జు మధ్య నడిచే విమానాలలో 60 శాతం రద్దు చేశారు. పాజిటివ్‌ కేసులను జీరోకు తీసుకురావడంతో కరోనాను కట్టడి చేయవచ్చని అనుకుంటున్న చైనా ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఒక్క కేసు నమోదైనా ఆ ప్రాంత బోర్డర్‌లను మూసి వేస్తోంది. లక్షల సంఖ్యలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలను చేపడుతోంది. ఇప్పటికే 200 కోట్లకు పైగా వ్యాక్సినేషన్‌లను కంప్లీట్‌ చేసిన చైనా కరోనాను నియంత్రించడానికి తీవ్రంగా శ్రమిస్తోంది.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Follow us