Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mani Sharma Son Marriage: అట్టహాసంగా సింగర్‌ను వివాహమాడిన మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్

టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ వివాహం ఘనంగా జరిగింది. గాయని సంజనను సాగర్ పెళ్లాడారు. వీరి పెళ్లి చెన్నైలోని టీ నగర్

Mani Sharma Son Marriage: అట్టహాసంగా సింగర్‌ను వివాహమాడిన మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్
Manisharma Son
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 25, 2021 | 8:27 PM

Swara Sagar Mahathi: టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ వివాహం ఘనంగా జరిగింది. గాయని సంజనను సాగర్ పెళ్లాడారు. వీరి పెళ్లి చెన్నైలోని టీ నగర్ దగ్గరున్న ద అకార్డ్ ఫంక్షన్ హాల్‌లో సన్నిహితుల మధ్య జరిగింది. పలువురు సినీ ప్రముఖులు సైతం వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇటు, హైదరాబాద్లో టాలీవుడ్ సెలెబ్రిటీల కోసం భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారు, తెలుగు సినీ ప్రముఖులంతా ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉంది.

కాగా, మణిశర్మ తనయుడు మహతి కూడా పేరున్న సంగీత దర్శకుడే. ఇప్పటికే పలు మ్యూజికల్ హిట్ లను ఆయన అందించాడు. ఇటీవల వచ్చిన ‘ఛలో’, ‘భీష్మ’, ‘మ్యాస్ట్రో’ సినిమాలకు సంగీతం అందించింది మహతినే. కాగా చిరంజీవి సినిమా బోళా శంకర్ కు కూడా ఇతనే సంగీత దర్శకుడు కావడం విశేషం. భీష్మలోని ‘హేయ్ చూశా’ అనే పాటను కూడా పాడాడు మహతి సాగర్.

తన తండ్రి మణిశర్మ దగ్గర పలు సినిమాలకు సౌండ్ ఇంజినీర్ గా కూడా పనిచేశారు స్వరసాగర్. ఇక పెళ్లికూతురు సంజన కూడా మంచి గాయని. ఆమె పలు తమిళ, కన్నడ చిత్రాల్లో పాటలు పాడారు. కొన్ని రోజుల క్రితమే వీరిద్దరికీ వైభవంగా నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం ఫోటోలు నెట్ లో బాగా వైరల్ అయ్యాయి.

Read also: MP Bharat: బాబు, అండ్‌ కోను అరెస్టు చేసి.. అండమాన్‌ లాంటి దీవుల్లో వేయండి.. రాష్ట్రపతికి ఎంపీ విజ్ఞప్తి