MP Bharat: బాబు, అండ్‌ కోను అరెస్టు చేసి.. అండమాన్‌ లాంటి దీవుల్లో వేయండి.. రాష్ట్రపతికి ఎంపీ విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్‌లోని యువతపై డ్రగ్స్‌ నెపం మోపుతూ.. రాష్ట్ర పరువును తీయడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్లాడని, పదవి, అధికారం లేకపోతే రాష్ట్ర పరువు తీస్తారా అంటూ

MP Bharat: బాబు, అండ్‌ కోను అరెస్టు చేసి.. అండమాన్‌ లాంటి దీవుల్లో వేయండి.. రాష్ట్రపతికి ఎంపీ విజ్ఞప్తి
Mp Margani Bharath
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 25, 2021 | 8:02 PM

MP Margani Bharat: ఆంధ్రప్రదేశ్‌లోని యువతపై డ్రగ్స్‌ నెపం మోపుతూ.. రాష్ట్ర పరువును తీయడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్లాడని, పదవి, అధికారం లేకపోతే రాష్ట్ర పరువు తీస్తారా అంటూ వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌ ధ్వజమెత్తారు. చంద్రబాబు నీచ రాజకీయాలను, కుటిలబుద్ధిని ప్రజలంతా గమనించాలన్నారు. అసాంఘిక శక్తులకు రారాజు చంద్రబాబు తయారయ్యారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీకి వచ్చి దేశ ప్రథమ పౌరుడికి అబద్ధాలు, అవాస్తవాలు చెప్పినందుకు చంద్రబాబు, అండ్‌ కోను వెంటనే అరెస్టు చేసి.. అండమాన్‌ లాంటి దీవుల్లో వేయాలని రాష్ట్రపతిని ఎంపీ మార్గాని భరత్‌ విజ్ఞప్తి చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు బృందం ఢిల్లీ పర్యటనపై ఎంపీ మార్గాని భరత్, తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘ఢిల్లీకి రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్లావా..? రాష్ట్రం పరువు తీయడానికి వెళ్లావా..?’ అంటూ ఆయన టీడీపీ అధినేతని ప్రశ్నించారు. వైశ్రాయ్‌ హోటల్‌లో ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించినప్పుడు ఢిల్లీకి వెళ్లి.. అక్కడి పెద్దలను మభ్యపెట్టారని, ఓటుకు కోట్ల కేసు సమయంలో ఢిల్లీ వెళ్లి ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని ఆయన చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు.

గతంలో ప్రధాని నరేంద్ర మోదీని తిట్టిన సీడీలు చూపించడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్లారా..? లేక తిరుపతిలో అమిత్‌షాని రాళ్లతో దాడి చేసిన వీడియోలు చూపించడానికి వెళ్లారా అని ఎంపీ మార్గాని ప్రశ్నించారు. మత, కుల రాజకీయాలు అయిపోయాయి.. కొత్తగా డ్రగ్స్‌ రాజకీయాలు తీసుకువస్తూ దాంట్లో బూతు రాజకీయాలు యాడ్‌ చేస్తున్నాడని ఎంపీ ధ్వజమెత్తారు. చంద్రబాబును మూడు సార్లు ముఖ్యమంత్రిని ఎలా చేశారో అర్థం కావడం లేదని మార్గాని భరత్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Read also: Maoist Bandh Call: ములుగు ఎన్‌కౌంటర్ బూటకం.. 27న తెలంగాణ బంద్‌కు మావోల పిలుపు