AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Freshers Party: ఇదెక్కడి స్వాగతం సామీ.. ఇలా కూడా వెల్‌కమ్ చెబుతారా?.. ఆ యూనివర్సిటీలో ప్రెషర్స్ పార్టీ స్టైలే వేరు..!

University Freshers Party: యూనివర్సిటీల్లో, కాలేజీల్లో ప్రతీ ఏటా కొత్త బ్యాచ్ వచ్చి చేరుతుందనే విషయం తెలిసిందే. కాలేజీలో చేరిన ప్రెషర్స్ బ్యాచ్‌కు సీనియర్లు వెల్‌కమ్ చెబుతూ

Freshers Party: ఇదెక్కడి స్వాగతం సామీ.. ఇలా కూడా వెల్‌కమ్ చెబుతారా?.. ఆ యూనివర్సిటీలో ప్రెషర్స్ పార్టీ స్టైలే వేరు..!
Shaving Cream
Shiva Prajapati
|

Updated on: Oct 25, 2021 | 8:49 PM

Share

University Freshers Party: యూనివర్సిటీల్లో, కాలేజీల్లో ప్రతీ ఏటా కొత్త బ్యాచ్ వచ్చి చేరుతుందనే విషయం తెలిసిందే. కాలేజీలో చేరిన ప్రెషర్స్ బ్యాచ్‌కు సీనియర్లు వెల్‌కమ్ చెబుతూ ప్రెషర్స్ పార్టీ నిర్వహిస్తారే సంగతి కూడా తెలిసిందే. సాధారణంగా ప్రెషర్స్ పార్టీ అంటే.. వేదిక ఏర్పాటు చేసి, డ్యాన్స్‌లు, డ్రామాలు, స్కిట్‌లు, ప్రత్యేక కార్యక్రమాలు వంటి వాటితో నానా హంగామా ఉంటుంది. ప్రెషర్స్ పార్టీలో ఉండే రచ్చే వేరు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా.. ఆ పార్టీలో అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. కొందరు కేక్‌లు తినిపించుకుంటారు. కొన్ని ప్రోగ్రామ్స్‌లో ఫుడ్ ఏర్పాటు చేసి.. అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. ఇలా నానా హంగామాతో ప్రెషర్స్ పార్టీ జరుగుతుంది. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే యూనివర్సిటీలో ఇప్పటి వరకు ఎక్కడా జరుగని విధంగా.. ప్రెషర్స్ పార్టీ నిర్వహిస్తారు. ఆ ప్రెషర్స్ పార్టీని ఎలా చేసుకుంటారో తెలిస్తే మీరు కూడా షాక్ అవడం ఖాయం.

స్కాట్లాండ్‌లో యానివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీ ఉంది. అన్ని కాలేజీల్లో నిర్వహించినట్లుగానే ప్రతీ ఏటా ఈ కాలేజీలో ప్రెషర్స్ పార్టీ నిర్వహిస్తుంటారు. అయితే, ఇందులో కాస్త భిన్నంగా.. చూసినోళ్లకు ఇదేం పార్టీరా అయ్యా అని అనిపించేలా చేస్తుంటారు. ఇంతకీ పార్టీ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కాలేజీలో నిర్వహించే ప్రెషర్స్ పార్టీలో.. సీనియర్లు, జూనియర్లు కలిసి షేవింగ్ క్రీమ్‌తో ఫైట్ చేసుకుంటారు. వేల కొద్ది షేవింగ్ క్రీమ్స్ బాటిల్స్‌ను తెచ్చి ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. దీనికి ఒక పేరు కూడా పెట్టారు. యూనివర్సిటీ విద్యార్థులు దీనిని ‘రైజింగ్ మండే షేవింగ్ ఫోమ్ ఫైట్’ అని పిలుస్తారట. ఇలా షేవింగ్ క్రీమ్ ఫోమ్‌ను ఒకరిపై మరొకరు జల్లుకుంటూ రచ్చ రచ్చ చేస్తారు. కాగా, ఈ షేవింగ్ క్రీమ్ ఫైట్‌కు సంబంధించిన పోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also read:

Viral News: అతను మార్వెల్‌ కంటే సూపర్‌ హీరో.. నెటిజన్లు ఆకట్టుకుంటున్న ఆనంద్ మహీంద్ర ట్వీట్..

Tirumala: న‌వంబ‌ర్ మాసంలో తిరుమల శ్రీ‌వారికి జ‌రుగ‌నున్న విశేష ఉత్సవాల వివ‌రాలు

TRS Plenary: 8 గంటలు.. ఏడు తీర్మానాలు.. కోలాహలం మధ్య 20 ఏళ్ల గులాబీ పండుగ..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..