వర్మ రింగ్ మాస్టర్..  ఆసక్తికర కామెంట్స్ చేసిన మంచు మనోజ్.. హిలేరియస్ ఆన్సర్ ఇచ్చిన ఆర్జీవి..

రామ్ గోపాల్ వర్మ.. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే వర్మ.. ఎప్పుడు ఎలాంటి

వర్మ రింగ్ మాస్టర్..  ఆసక్తికర కామెంట్స్ చేసిన మంచు మనోజ్.. హిలేరియస్ ఆన్సర్ ఇచ్చిన ఆర్జీవి..
Rgv
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 26, 2021 | 7:10 AM

రామ్ గోపాల్ వర్మ.. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే వర్మ.. ఎప్పుడు ఎలాంటి ట్వీట్ చేస్తాడో.. ఎవరి గురించి ప్రస్తావిస్తారో అర్థం కాదు. సినిమాల గురించి మాత్రమే కాకుండా…ప్రాంతీయ రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వరకు.. స్పోర్ట్స్ విషయంలోనూ ఇలా అన్నింట్లోనూ తనదైన మాటలతో సెటైర్స్ వేస్తుంటాడు వర్మ.. కరోనా లాక్ డౌన్ సమయంలో సినిమాలన్ని ఆగిపోయిన.. ఆర్జీవి మాత్రం చిత్రాలను తెరకెక్కిస్తూ ఫుల్ బిజీగా గడిపాడు. తాజాగా రామ్ గోపాల్ వర్మ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై ఆసక్తికర ట్వీట్ చేశాడు..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి ఎన్నికలు ఎంత గందరగోళంగా జరిగాయో తెలిసిన సంగతే. ఆర్టిస్ట్ ఎన్నికలైన రాజకీయ ఎలక్షన్లను తలపించాయి. విమర్శలు.. గొడవలతో మా అసోసియేషన్ హీటేక్కింది. ఎంతో రసవత్తరంగా జరిగిన మా ఎన్నికల్లో విజయం సాధించి మా అధ్యక్ష పీఠం పగ్గాలను మంచు విష్ణు చేపట్టారు. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ మా ఎన్నికల అనంతరం.. మా జోకర్లతో నిండిన సర్కస్ అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్వీట్ పై మంచు మనోజ్ స్పందిస్తూ… మా సర్కస్ అయితే మీరు రింగ్ మాస్టర్ అంటూ కామెంట్ చేశారు.. దీంతో వర్మ మనోజ్ ట్వీట్‏కు స్పందిస్తూ.. సర్.. నేను రింగ్ మాస్టర్ కాను.. నేను వినోదాన్ని పంచే కోతిని మాత్రమే అంటూ హిలేరియస్ రిప్లై ఇచ్చారు. ఇందుకు మనోజ్ స్పందిస్తూ.. మనందరం సేమ్ సర్కస్‏కు చెందినవాళ్లమే సర్ అంటూ ట్వీట్ చేశారు.. ఇందుకు వర్మ అవును అంటూ ప్రతిస్పందించాడు.. ఇలా వీరిద్దరి మధ్య ట్విట్టర్ వేదికపై ఆసక్తికర సంభాషణ నడిచింది.

ట్వీట్స్..

ALSO READ:  Samantha: సమంత పరువునష్టం దావా కేసులో వాదనలు వినిపించిన లాయర్‌.. సమంత ఎక్కడా డబ్బు ఆడగలేదని..

Mani Sharma Son Marriage: అట్టహాసంగా సింగర్‌ను వివాహమాడిన మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్

Bigg Boss 5 Telugu: గుక్కపెట్టి ఏడ్చిన కంటెస్టెంట్స్.. ఈ వారం నామినేట్ అయిన సభ్యులు వీరే..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే