Bigg Boss 5 Telugu: గుక్కపెట్టి ఏడ్చిన కంటెస్టెంట్స్.. ఈ వారం నామినేట్ అయిన సభ్యులు వీరే..

బిగ్‏బాస్ ఏడోవారం పూర్తైంది.. సండే ఇంటి నుంచి ప్రియ బయటకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఎనిమిదవ వారం నామినేషన్

Bigg Boss 5 Telugu: గుక్కపెట్టి ఏడ్చిన కంటెస్టెంట్స్.. ఈ వారం నామినేట్ అయిన సభ్యులు వీరే..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 26, 2021 | 6:41 AM

బిగ్‏బాస్ ఏడోవారం పూర్తైంది.. సండే ఇంటి నుంచి ప్రియ బయటకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఎనిమిదవ వారం నామినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.. 19 మంది కంటెస్టెంట్స్‏తో ప్రారంభమైన ఈ షో.. ఇప్పుడు 13 మంది మాత్రమే మిగిలారు. ఇక ఈ సోమవారం నామినేషన్ ప్రక్రియతో ఇంటి సభ్యులను ఏడిపించాడు బిగ్ బాస్. ఇక ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయిన సభ్యులు ఎవరో తెలుసుకుందామా..

ప్రతివారం మాదిరిగా కాకుండా.. ఈసారి కాస్త విభిన్నంగా నామినేషన్స్ ప్రక్రియ అమలు చేశాడు బిగ్ బాస్. షో మొదలై అప్పుడే 50 రోజులు పూర్తైందని.. మీకు ఎంతో ప్రియమైన నుంచి లేఖను పొందే అవకాశం లభిస్తుందని చెప్పాడు బిగ్ బాస్. కానీ ఏదైనా దక్కించుకోవాలంటే ఇంకేదైనా వదులుకోవాల్సి వస్తుందని నామినేషన్ గురించి చెప్పుకోచ్చాడు..నామినేషన్ ప్రక్రియలో భాగంగా.. పోస్ట్ మ్యాన్ ఇద్దరు ఇంటి సభ్యులను పవర్ రూంకు పిలుస్తుంటాడు. వారి ముందున్న బ్యాగ్ లో రెండు లేఖలు ఒకరికి మాత్రమే ఇచ్చి మిగతాది చింపివేయాల్సి ఉంటుంది. లెటర్ తీసుకోని వాళ్లు నామినేట్ అయినట్లు అని తెలిపాడు. ముందుగా పవర్ రూంలోకి వెళ్లి మానస్, శ్రీరామ్ లకు లోబో.. ప్రియాంక లేఖలు వచ్చాయి.. దీంతో లోబో.. తన భార్య గర్బవతి అని.. అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలి అంటూనే ప్రియాంక కోసం తన లేఖను త్యాగం చేశాడు. ఆ తర్వాత షణ్ను, రవిలకు.. విశ్వ, సిరి లేఖలు అందాయి. ఇక విశ్వ కోసం తన లేఖను త్యాగం చేసింది సిరి.

ఆ తర్వాత ప్రియాంక, కాజల్ కు యానీ మాస్టర్, మానస్ లేఖలు అందాయి. యానీ పరిస్థితి అర్థం చేసుకున్న మానస్ తన లేఖను త్యాగం చేశాడు.. ఇక మానస్ లేఖలు ముక్కలవ్వడంతో ప్రియాంక ఎమోషనల్ అయ్యింది. విశ్వ.. లోబోలకు రవి.. శ్రీరామ్ లెటర్స్ వచ్చాయి. ఇక రవి కోసం శ్రీరామ్ తన లేఖను త్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు.. కానీ లోబో.. రవి తన కుటుంబాన్ని గుర్తించేసుకునేందుకు బొమ్మ, టీషర్ట్, లెటర్ ఉన్నాయని… కాబట్టి శ్రీరామ్ కు ఇవ్వాలని కోరాడు. దీంతో రవి తన లేఖను త్యాగం చేశాడు.. ఇక ఆ తర్వాత.. యానీ మాస్టర్, సిరిలకు షణ్ముఖ్, కాజల్ లెటర్స్ వచ్చాయి. దీంతో కాజల్ గుక్కపెట్టి ఏడ్చేసింది. ఇక కాజల్ కోసం షన్ను తన లేఖను త్యాగం చేశాడు.. దీంతో తను ఏలాగో లేఖ తీసుకోలేదని.. కనీసం నువ్వైనా తీసుకోవాలంటూ సిరి షన్నూను కోరింది. కానీ షణ్ముఖ్ అందుకు ఒప్పుకోలేదు.. అమ్మ క్యాన్సర్ ను జయించావు.. అమ్మమ్మ చనిపోయినప్పుడు ఆ బాధ నుంచి కోలుకున్నావు. నువ్వే నా ఇన్‏స్పిరేషన్ .. నేను ఈ బాధలో నుంచి బయటపడతాను అంటూ గుక్కపెట్టి ఏడ్చాడు.. ఇక కెప్టెన్ సన్నీకి స్పెషల్ పవర్ లభించింది. దీని ద్వారా జెస్సీ లెటర్ సన్నీ చేతిలో పెట్టాడు బిగ్ బాస్.. జెస్సీకి లెటర్ ఇచ్చి సేవ్ చేయాలంటే ఆల్రెడీ సేవ్ అయినవాళ్ల దగ్గరి నుంచి లేఖ తీసుకోవాలని చెప్పాడు. దీంతో శ్రీరామ్.. జెస్సీ కోసం తన లేఖను త్యాగం చేయడానికి ముందుకొచ్చాడు. కానీ షణ్ముఖ్, సిరి, జెస్సీ.. శ్రీరామచంద్రకు హగ్ ఇచ్చి దూరాన్ని చెరిపేసుకోవాలని రవి కండిషన్ పెట్టాడు.. అయితే తమ మధ్య ఉన్న డిస్టబెన్స్ ఎప్పుడో పోయిందని చెప్పారు త్రిముర్తులు.. అయితే తన కోసం శ్రీరామ్ తో ఇది కేవలం లెటర్ ఇవ్వడం మాత్రమే కాదని.. నామినేషన్స్ లోకి వెళ్తారని.. అందుకు తను ఒప్పుకోను అంటూ జెస్సీ వాదించాడు. కానీ శ్రీరామ్ జెస్సీని కన్వెన్స్ చేసి ఒప్పించి తన లేఖను ముక్కలు చేశాడు… దీంతో ఈ వారం నామినేషన్ ప్రక్రియను హౌస్ మోట్స్ ఎమోషన్స్‏తో జత చేశాడు బిగ్ బాస్. ఇక ఈ వారం ఇంటి నుంటి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయిన సభ్యులు లోబో, సిరి, మానస్, షణ్ముఖ్, శ్రీరామ్, రవి ఉన్నారు. ఇక చివరగా కెప్టెన్ సన్నీకి కూడా లేఖ ఇచ్చి సంతోషపరిచాడు బిగ్ బాస్.

Also Read: Samantha: సమంత పరువునష్టం దావా కేసులో వాదనలు వినిపించిన లాయర్‌.. సమంత ఎక్కడా డబ్బు ఆడగలేదని..

Mani Sharma Son Marriage: అట్టహాసంగా సింగర్‌ను వివాహమాడిన మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే