Bigg Boss 5 Telugu: అనారోగ్యం వల్ల ఆపరేషన్ చేయించుకున్నాడనుకున్నా.. షాకింగ్ విషయాలను చెప్పిన ప్రియాంక పేరెంట్స్..

బిగ్‏బాస్ సీజన్ 5లో ఇప్పటివరకు ఎలాంటి కంప్లైట్స్, కాంట్రావర్సీలు లేకుండా స్ట్రాంగ్ కంటెస్టెంట్‏గా కొనసాగుతుంది ప్రియాంక.

Bigg Boss 5 Telugu: అనారోగ్యం వల్ల ఆపరేషన్ చేయించుకున్నాడనుకున్నా.. షాకింగ్ విషయాలను చెప్పిన ప్రియాంక పేరెంట్స్..
Priyanka
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 26, 2021 | 10:05 AM

బిగ్‏బాస్ సీజన్ 5లో ఇప్పటివరకు ఎలాంటి కంప్లైట్స్, కాంట్రావర్సీలు లేకుండా స్ట్రాంగ్ కంటెస్టెంట్‏గా కొనసాగుతుంది ప్రియాంక. ట్రాన్స్‏జెండర్ కంటెస్టెంట్‏గా బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన పింకీ తన ఆట తీరు.. ప్రవర్తనతో నెట్టింట్లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ ఇంట్లో ఇప్పటివరకు ఎక్కువగాసంప్రదాయపు దుస్తులలో చూడచక్కగా కనిపిస్తుంది పింకీ మాత్రమే అంటూ సోషల్ మీడియాలో టాక్ కూడా నడుస్తోంది. గత సీజన్‏లో వచ్చినా.. తమన్నా సింహద్రికి ప్రియాంక పూర్తిగా వ్యతిరేకం.. రోజు రోజుకీ తన ఆట తీరుతో.. ఇతర టాస్కులలో స్ట్రాంగ్ పోటీనిస్తున్న ప్రియాంకకు మద్దతు భారీగానే పెరుగుతుంది.

అయితే ప్రియాంక బిగ్‏బాస్ ఎంట్రీ సమయంలో.. తను ట్రాన్స్ జెండర్ గా మారిన సంగతి తన తండ్రికి తెలియదని చెప్పి ఎమోషనల్ అయ్యింది.. దీంతో ఆమె పుట్టిన రోజు కానుకగా.. తన తండ్రి వీడియో సందేశం ద్వారా తనను తన తండ్రి ఒప్పుకున్న విషయాన్ని చూపించడంతో ప్రియాంక బోరున ఏడ్చేసింది.. ప్రియాంక బర్త్ డే ఎపిసోడ్ ప్రేక్షకులను హత్తుకుంది. తాజాగా ప్రియాంక గురించి ఆమె తల్లిదండ్రులు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రియాంక తల్లి మాట్లాడుతూ.. ఇంతకు ముందు మేము బిగ్ బాస్ షో చూడలేదు.. మా తేజూ బిగ్ బాస్ వెళ్లిన తర్వాతే చూస్తున్నాం.. బాగా ఆడుతుంది. మాతోపాటు.. మా ఊరు మొత్తం బిగ్ బాస్ చూస్తుంది. మా తేజ ఇప్పుడు బిగ్ బాస్ లో చూస్తున్నట్లుగా ఇంట్లో చూడలేదు.. ఎప్పుడు జీన్స్ చొక్కా వేసుకునే ఉండేవాడు.. కానీ అక్కడ చీరలు కట్టుకుంటున్నాడు.. డ్రెస్సింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. అలా ఉంటే బాగుంది. తేజూ మా బంగారు కొండ.. చాలా బాధలు పడ్డాడు.. తన కష్టానికి తగ్గ ప్రతి ఫలం దక్కాలంటే ఖచ్చితంగా విన్నర్ కావాలి అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ప్రియాంక తండ్రి డీబి సింగ్ మాట్లాడుతూ.. నాగార్జున గారు నా పేరు చెప్పారు.. నేను చూడలేను.. కానీ విన్నాను.. చాలా సంతోషంగా అనిపించింది. సాయి బిగ్ బాస్ కి వెళ్లడం గర్వంగా ఉంది. ట్రాన్స్ జెండర్ గా మారానని ఆపరేషన్ అయినట్లుగా మా నాన్నకు తెలియదని ఏడ్చాడు.నేను సాయిని క్షమించాను.. అనారోగ్యం వలన ఆపరేషన్ చేయించుకుని ఉంటాడు. వాడు ఎక్కడా.. ఎలా ఉన్న సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సాయికి అందరూ ఓట్లు వేయాలని ప్రార్థిస్తున్నా అన్నారు.

Also Read: Sekhar Kammula: పెద్ద మనస్సు చాటుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. రైతుకు సాయం.. అసలు ఏం జరిగిందంటే..

వర్మ రింగ్ మాస్టర్..  ఆసక్తికర కామెంట్స్ చేసిన మంచు మనోజ్.. హిలేరియస్ ఆన్సర్ ఇచ్చిన ఆర్జీవి..