Sekhar Kammula: పెద్ద మనస్సు చాటుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. రైతుకు సాయం.. అసలు ఏం జరిగిందంటే..
డైరెక్టర్ శేఖర్ కమ్ముల మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. గుడిసె దగ్ధమై డబ్బు కోల్పోయిన రైతుకు సాయం చేశారు. ఓ వార్త ఛానల్లో వచ్చిన కథనానికి స్పందించిన శేఖర్ కమ్ముల రైతును ఆర్థికంగా ఆదుకున్నారు...
డైరెక్టర్ శేఖర్ కమ్ముల మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. గుడిసె దగ్ధమై డబ్బు కోల్పోయిన రైతుకు సాయం చేశారు. ఓ వార్త ఛానల్లో వచ్చిన కథనానికి స్పందించిన శేఖర్ కమ్ముల రైతును ఆర్థికంగా ఆదుకున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామానికి చెందిన కప్పల లక్ష్మయ్య తన సోదరులతో కలిసి తమకు ఉన్న వ్యవసాయ భూమి అమ్మారు. అందులో లక్ష్యయ్య వాటాగా రూ.10 లక్షలు వచ్చాయి. ప్రస్తుతం అతడు గుడిసెలో ఉంటున్నాడు. ఆ డబ్బుతో ఇల్లు నిర్మించుకుందామని భావించాడు. 10 లక్షల రూపాయల్లో రూ.6 లక్షలను ఇంట్లోని బీరువాలో పెట్టాడు. ఇల్లు కట్టుకుందామని అందుకు సంబంధించిన పనులు ప్రారంభించాడు. ఇల్లు కడితే ఖర్చు ఎంత అవుతుందని మేస్త్రీని వివరాలు అడిగి తెలుసుకున్నాడు.
ఇల్లుకు ముగ్గు పోసేందుకు సిద్ధమయ్యాడు. అక్టోబర్ 21న అతను వంట చేసుకుందామని గ్యాస్ స్టవ్ వెలించాడు. కానీ అది అప్పటికే లీక్ అయి ఉండటంతో సిలిండర్ పేలింది. దీంతో పూరిగుడిసె కాలిపోయింది. అందులో ఉన్న బీరువా, బీరువాలో ఉన్న ఆరు లక్షల రూపాయలు కాలిపోయాయి. లక్ష్యయ్య ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కానీ ఇల్లు కట్టుకోవడం కోసం దాచుకున్న డబ్బులో మంటల్లో తగలబడి పోతుంటే నిస్సాహాయంగా చూశాడు. పైసలతోపాటు లక్ష్యయ్య సొంతింటి కల అగ్నికి ఆహుతయింది. ఈ ఘటనపై ఓ టీవీ ఛానల్లో వచ్చిన కథనానికి సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించారు. లక్ష రూపాయలను నేరుగా లక్ష్మయ్య బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు. లక్ష్మయ్య కుటుంబంతో మాట్లాడారు. భవిష్యత్‌లో వారికి అండగా ఉంటానని శేఖర్ కమ్ముల ధైర్యం చెప్పారు. తమను ఆదుకున్న శేఖర్ కమ్ములకు లక్ష్మయ్య కుటుంబం ధన్యావాదాలు తెలిపింది. శేఖర్ కమ్ముల ఈ మధ్యే లవ్‌స్టోరి సినిమా తీసి మంచి హిట్ సొంతం చేసుకున్నారు.
Read Also.. Ram Charan : అంచనాలు పెంచేస్తున్న చరణ్- శంకర్ సినిమా.. ఒక్క పాట కోసం భారీ ప్లాన్ చేసిన మేకర్స్..