Bigg Boss 5 Telugu Promo: నేను బరాబర్ మాట్లాడతా.. ఏం చేసుకుంటావో చేస్కో.. లోబో పై రెచ్చిపోయిన కాజల్..
బిగ్‌బాస్ ఎప్పుడు ఎలాంటి టాస్కులు ఇస్తాడో తెలియదు.. ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో.. ఢిపరెంట్ టాస్కులు, ఛాలెంజ్‌లు
బిగ్‌బాస్ ఎప్పుడు ఎలాంటి టాస్కులు ఇస్తాడో తెలియదు.. ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో.. ఢిపరెంట్ టాస్కులు, ఛాలెంజ్‌లు విసురుతూ ఇంటి సభ్యులను ముప్పుతిప్పలు పెడుతుంటాడు. ఇక ఏడు వారాలు పూర్తిచేసుకున్న బిగ్ బాస్.. ఎనిమిదో వారంలోకి ఎంటర్ అయ్యింది. ఇక నిన్న నామినేషన్స్ ప్రక్రియకు ఇంటి సభ్యులను ఎమోషన్స్ జత చేసి వారిని ఏడిపించేశాడు బిగ్ బాస్. ఇక ఈరోజు ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్.
కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం ఇంటిని లాక్డౌన్ చేసినట్లుగా ప్రకటించారు బిగ్ బాస్. ఇందులో భాగంగా అభయహస్తం టాస్కులో గెలిచి కెప్టెన్సీ కంటెస్టెంట్ గా సెలక్ట్ అయిన సభ్యులు మాత్రమే ఇంట్లోకి వెళ్లాల్సి ఉంటుందని కండిషన్ పెట్టాడు. ఇందులో భాగంగా గార్డెన్ ఏరియాలో కెప్టెన్సీ టాస్క్ కోసం ఏర్పాట్లు చేశారు. ముందుగా ఇక షణ్ముఖ్, లోబో మొదట కెప్టెన్ గా సెలక్ట్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. బాత్ టబ్ లో ఉన్న ఆవు పేడలో ఉన్న ముత్యాలను కనుక్కోవాల్సి ఉంటుంది. ఇందుకు సన్నీకి సంచాలకులుగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. ఇక బజర్ మోగిన వెంటనే షణ్ముఖ్, లోబో బాత్ టబ్ లోకి దిగి ముత్యాలను వెతికే పనిలో పడ్డారు. అయితే విశ్వ.. కాజల్ ఎప్పటిలాగే తమ నోటికి పని చెప్పారు.. దీంతో షణ్ముఖ్ విశ్వపై సీరియస్ కాగా లోబో సర్దిచెప్పాడు. ఇక ఆ తర్వాత కాజల్‌ను మాట్లాడొద్దని.. ఏదైనా ఉంటే సంచాలకులు చూసుకుంటారని లోబో చెప్పగా.. కాజల్ రెచ్చిపోయింది. నా ఇష్టం అని.. బరాబర్ మాట్లాడతా.. వినాలని లేకపోతే చెవులు మూసుకోవాలంటూ అడ్డంగా వాదించింది. వేరే చోటికి వెళ్లి మాట్లాడుకో అని లోబో చెప్పగా , తను ఎక్కడికి వెళ్లనని అంటూ గొడవ చేసింది. మొత్తానికి ఈరోజు బిగ్ బాస్ ఇళ్లు గొడవలో రచ్చ జరగబోతుందని అర్థమవుతుంది.
Also Read: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?…. తెలుగులో మోహన్ బాబు సరసన ఈ అమ్మడు నటించిన సినిమా సూపర్ హిట్..
Sekhar Kammula: పెద్ద మనస్సు చాటుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. రైతుకు సాయం.. అసలు ఏం జరిగిందంటే..