- Telugu News Photo Gallery Cinema photos Actress mamta kulkarni's latest photos viral in social media
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?…. తెలుగులో మోహన్ బాబు సరసన ఈ అమ్మడు నటించిన సినిమా సూపర్ హిట్..
ఫోటోలో ఉన్నది టాప్ హీరోయిన్.. తెలుగు, తమిళ్, హిందీ సినీ పరిశ్రమలో వరుస సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
Updated on: Oct 26, 2021 | 11:32 AM

ఫోటోలో కనిపిస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్, బెంగాళీ సినీ పరిశ్రమలలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. వరుస సూపర్ హిట్ చిత్రాలతో అగ్ర కథనాయికగా కొన్నేళ్లు కొనసాగింది.

1990లో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే ఈమె సినిమాలకు స్వస్తి చేప్పింది. అంతేకాకుండా. సినిమాలతోపాటే.. ఈమెకు వివాదాలు కూడా ఎక్కువే.

సినిమా మ్యాగజైన్ కోసం టాప్ లెస్ షూట్ చేసిన తర్వాత ఈ హీరోయిన్ చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి. ఆ ఫోటోషూట్ చేసినందుకు గానూ.. భారీగానే జరిమానా కట్టాల్సి వచ్చింది.

ఎవరో గుర్తుపట్టారా.. తెలుగులో హీరో ప్రశాంత్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు సైతం చేరువయ్యింది. ప్రేమ శిఖరం సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. గుర్తుపట్టారు కదా..

ఈ హీరోయిన్ మరెవరో కాదు.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ మమతా కులకర్ణి.. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే సినిమాలకు దూరమయ్యింది మమతా..

సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, మోహన్ బాబు, సైఫ్ అలీఖాన్, అజయ్ దేవగణ్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

తాజాగా మమతాకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మమతా ఓ ఎన్ఆర్ఐ ను వివాహం చేసుకుని న్యూయార్క్‌లో సెటిల్ అయ్యింది. కొన్నేల్లకు వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.

ఆ తర్వాత అంతర్జాతీయ డ్రగ్స్ వ్యాపారీ విక్కీ గోస్వామిని వివాహం చేసుకున్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. 2016లో విక్కీ గోస్వామి అరెస్ట్ తర్వాత మమత US డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA) స్కానర్ కిందకు వచ్చింది. ఆ తర్వాత మమతా కులకర్ణిని డీఈఏ వాంటెడ్‌గా ట్యాగ్ చేసింది.

తెలుగులో హీరో ప్రశాంత్ సరసన ప్రేమ శిఖరం సినిమాలో నటించింది.

అలాగే మోహన్ బాబు సరసన దొంగ పోలీస్, బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది మమతా..
