Narender Vaitla | Edited By: Phani CH
Updated on: Oct 26, 2021 | 6:57 AM
తెలుగు రాష్ట్రాల బుల్లి తెర వీక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరి రష్మీ గౌతమ్. తన చలాకీ మాటలు, అందమైన రూపంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోందీ బ్యూటీ.
సినిమాల్లో చిన్న క్యారెక్టర్లతో కెరీర్‌ను ప్రారంభించిన రష్మీ.. జీవితం జబర్దస్త్‌తో ఒక్కసారిగా మారిపోయింది. ఏమంటూ జబర్ధస్త్‌లో యాంకర్‌గా మారిందో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైందీ చిన్నది.
ఓవైపు యాంకర్‌గా కెరీర్‌ను కొనసాగిస్తూనే ఆడపాదడపా సినిమాల్లో నటిస్తోందీ బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మీ తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.
ఈ క్రమంలోనే తాజాగా ఈ అందాల భామ చీర కట్టులో దిగిన కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ఫోటోల్లో పూల ప్రింట్ ఉన్న శారీలో ఉన్న రష్మీ ఆకట్టుకుంటోంది.
ఇక ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు ఫుల్ ఫిదా అవుతున్నారు. పెద్ద ఎత్తున లైక్‌లు, కామెంట్లు చేస్తున్నారు. రష్మీ ఈ ఫోటోలను పోస్ట్ చేసిన కేవలం 6 గంటల్లోనే లక్షన్నర లైక్‌లు రావడం విశేషం