AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upcoming Movies: ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి థియేటర్స్ , ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే.. ..

Upcoming Movies in This Week: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గిన తర్వాత థియేటర్స్ లో చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే దసరాకు..

Upcoming Movies: ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి థియేటర్స్ , ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే.. ..
Upcoming Movies
Surya Kala
|

Updated on: Oct 25, 2021 | 12:37 PM

Share

Upcoming Movies in This Week: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గిన తర్వాత థియేటర్స్ లో చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే దసరాకు చిన్న సినిమాలు భారీగా రిలీజ్ అయ్యి సందడి చేశాయి.  ఓ వైపు కుదిరితే సినిమా థియేటర్స్ లో రిలీజ్.. లేదంటే ఓటిటి లో రిలీజ్ .. కానీ అనుకున్న సమయంలో రిలీజ్ చేయడం పక్క అన్నట్లు సాగుతుంది.  ఈ వారం కూడా  థియేటర్ తో పాటు ఓటిటి లో కూడా  సినిమాలు  సందడి చేయటానికి రెడీ అయ్యాయి. ఈరోజు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమాలేంటో చూద్దాం..

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా కేతికా శర్మ హీరోయిన్ గా అనిల్‌ పాడూరి తెరకెక్కించిన చిత్రం’రొమాంటిక్‌’.  కరోనా వలన రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఈనెల 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. రమ్యకృష్ణ కీలక పాత్ర లో కనిపించనుంది. పూరి కనెక్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు.

యంగ్ నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన వరుడు కావాలి కూడా ఈ నెల 29న  థియేటర్ లో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అనిల్ ఇనమడు హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరక్కించిన మూవీ తీరం.. ‘ప్రేమ, రొమాంటిక్‌ అంశాలతో రెండు జంటల కథగా సాగుతున్న ఈ సినిమాలో మరో హీరోగా శ్రావణ్‌ వై.జి.టి నటించగా  క్రిస్టెన్‌ రవళి, అపర్ణ  హీరోయిన్లుగా నటిస్తున్నారు. తీరం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అక్టోబర్ 29నే మరో సినిమా రవాణ లంక రిలీజ్ కానుంది. ఈ సినిమాలో క్రిష్‌ బండిపల్లి, అస్మిత కౌర్‌ జంటగా నటించారు.  విహారయాత్ర కోసం వెళ్లి నలుగురు స్నేహితుల్లో ఒకరు అనుమానాస్పదంగా  మరణిస్తే అన్న నేపథ్యంలో సస్పెన్స్ థిల్లర్ గా తెరక్కింది.

ఇక ఈ వారం అమెజాన్ ప్రైమ్, నెట్ ప్లిక్స్ , డిస్ని హాట్ స్టార్, ఆహా వంటి ఓటిటిలో రిలీజయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ వివరాల్లోకి వెళ్తే..  అమెజాన్‌ ప్రైమ్‌ లో ఈనెల 29 న  హిందీలో డైబుక్‌ స్ట్రీమ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్‌ లో ఇప్పటికే తమిళంలో  లాభం రిలీజ్ అయింది. ఇక హిప్నోటిక్‌ అక్టోబరు 27, ఆర్మీ ఆఫ్‌ దీవ్స్‌  అక్టోబరు 29న ప్రసారం కానున్నాయి. జీ5 లో  ఈనెల 29వ తేదీన ఆఫత్‌ ఈ ఇష్క్‌ ప్రసారం కానుంది. సోనీలివ్‌ లో తెలుగు సినిమా ఫ్యామిలీ డ్రామా ఈనెల 29న రిలీజ్ కానుంది. మరోవైపు డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ లో హిందీ హమ్‌ దో హమారే దో అక్టోబరు 29న స్ట్రీమ్ కానున్నాయి.

Also Read: : ప్లీనరీలో పసందైన విందు.. రాగిసంగటి, ఉలవచారు నుంచి ఇరాన్ ఛాయ్ వరకూ..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?