TRS Plenary Food Menu: ప్లీనరీలో పసందైన విందు.. రాగిసంగటి, ఉలవచారు నుంచి ఇరాన్ ఛాయ్ వరకూ..

TRS Party Plenary Food Menu: తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ఏర్పాట్లు భారీగా చేశారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టి 20 వ సంవత్సరం సందర్భంగా..

TRS Plenary Food Menu: ప్లీనరీలో పసందైన విందు.. రాగిసంగటి, ఉలవచారు నుంచి ఇరాన్ ఛాయ్ వరకూ..
Trs Food Menu
Follow us
Surya Kala

|

Updated on: Oct 25, 2021 | 2:11 PM

TRS Party Plenary Food Menu: తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ఏర్పాట్లు భారీగా చేశారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టి 20 వ సంవత్సరం సందర్భంగా జరుగుతున్న ఈ వేడుకలకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదిక అయ్యింది. దాదాపు మూడేళ్ల తర్వాత జరుగుతున్న ఈ వేడుకకు దాదాపు 15 వేల మంది టిఆర్ఎస్ నేతలు హాజరవుతున్నట్లు అంచనా.. ఇక ఈ ప్లీనర్లీకి అంచనాకు తగ్గట్లు సదుపాయాలు సమకూర్చారు. ముఖ్యంగా అందరి దృష్టి భోజన ఏర్పాట్లపైనే ఉంది. ఎందుకంటే.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా అతిథులకు ప్రత్యేక మెనూ సిద్ధం చేశారు. ఈ వేడుకల్లో వెజ్‌, నాన్‌వెజ్‌ స్పెషల్స్‌, రోటి పచ్చళ్ళుతో ఘుమఘుమలాడించే వంటకాలు ఉండనున్నాయి.

ఈ ప్లీనరీ విందులో తెలంగాణ రుచులతో పాటు.. రాయలసీమ రాగి సంకటి కూడా చోటు చేసుకుంది. మొత్తంగా షడ్రుచోపేత వంటలను వేడివేడిగా వడ్డించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈసారి ప్రత్యేకంగా ఇరానీ ఛాయ్‌ని మెనూలో పెట్టారు. మొత్తంగా టీ నుంచి ఐస్‌క్రీమ్‌ వరకు ప్లీనరీకి వచ్చే వారి కోసం 34 రకాల వంటలు సిద్ధం చేస్తున్నారు మాంసాహార ప్రియుల కోసం తొమ్మిది రకాల వంటలు.. నాన్‌ వెజ్ ఐటమ్స్‌లో.. ధమ్ చికెన్ బిర్యాని, మటన్ కర్రీ, నాటు కోడి పులుసు, ఎగ్ మసాలా, నల్లా పొడి ప్రై, మటన్ దాల్చా, బోటీ ఫ్రై, పాయా సూప్, తలకాయ పులుసు స్పెషల్‌గా చేయిస్తున్నారు. ఇక మిగిలినవి వెజిటేరియన్స్‌ కోసమే తయారు చేయిస్తున్నారు. స్పెషల్ రోటీ పచ్చళ్ళు, మూడు రకాల స్పెషల్‌ స్వీట్లు, గత్తి వంకాయ కూర, జీడిపప్పు దట్టంగా జోడించిన బెండకాయ ఫ్రై.. వంటి వెజ్ కూరలతో ఘుమఘుమలాడించేలా వంటలు వండిస్తున్నారు. ఇక స్పెషల్ ఐటెంగా రాగి సంకటితో పాటు రుమాల్ రోటీ, ఆలూ క్యాప్సికం, బగారా రైస్, వెజ్ బిర్యాని, వైట్ రైస్,  చామగడ్డ పులుసు, మామిడికాయ పప్పు, పచ్చిపులుసు, ముద్దపప్పు, సాంబారు, ఉలవచారు వంటలు శాఖాహారుల కోసం, రెడీ చేయిస్తున్నారు. ఇక రోటీ పచ్చళ్లుగా వంకాయ చట్నీ, బీరకాయ టమోటా చట్నీ, వెల్లుల్లి జీడిగుల్ల ఆవకాయ ఉండనే ఉన్నాయి. పెరుగు, పెరుగు చట్నీ, వడియాలు చేయిస్తున్నారు. స్వీట్స్‌లో భాగంగా జిలేబీ, డబుల్‌కా మీటాను ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. ఇక ఆహారం తిన్నవారు.. చివరిగా చూసేది ఐస్‌క్రీం వైపు,.. దీనిని కూడా స్పెషల్ గా అతిధులకు అందించనున్నారు.

Also Read:  దీపావళి పండుగ శోభ.. ఇంటిని అలంకరించడానికి ప్రత్యేకమైన ఐడియాలు ఇవే