Diwali 2021: దీపావళి పండుగ శోభ.. ఇంటిని అలంకరించడానికి ప్రత్యేకమైన ఐడియాలు ఇవే

Diwali 2021: దేశంలో దీపావళి సంబరాలు మొదలయ్యాయి. పెద్దలకు, పిల్లలు ఇష్టంగా చేసుకొనే పండగల్లో ప్రధానమైన పండగ దీపావళి. ఇంటిని శుభ్రం చేసుకోవడం.. అందంగా అలంకరించడం.. కోసం అత్యధిక ప్రాధాన్యత నిస్తారు. ఈరోజు దీపావళికి ఇంటిని అందంగా ఈజీగా అలంకరించుకోవడానికి అద్భుతమైన చిట్కాలను తెలుసుకుందాం..

|

Updated on: Oct 25, 2021 | 11:26 AM

దీపావళి అంటే ముందుగా గుర్తుకొచ్చేది ప్రమిదలు.. అయితే కాలక్రమంలో వీటిల్లో అనేక మార్పులు వచ్చాయి. ఇప్పుడు మట్టి ప్రమిదలు ప్లేస్ లో అనేక ఆకృతుల్లో ప్రమిదలు మార్కెట్ లో లభిస్తున్నాయి. బడ్జెట్ కు అనుగుణంగా మనం వాటిని ఎంపిక చేసుకోవచ్చు.

1 / 6
పండగ శోభను ఇంటి ముందుకు తీసుకొచ్చేది రంగవల్లులు. దీపావళి రోజున ఇంటిముందు ముగ్గును వేసి.. అందులో ప్రమిదలను పెట్టడానికి మగువలు ఇష్టపడతారు.

2 / 6
దీపావళి అలంకరణల్లో తోరణాలు కూడా ప్రముఖ స్థానం ఉంది. మామిడాకులతో పాటు. ఇప్పుడు రెడీ మెడ్ గా లభించే ఎన్నో అలంకరణ వస్తువులతో దీపావళికి గుమ్మలను అలంకరిస్తున్నారు.

3 / 6
దీపావళికి ఇంటిని లక్ష్మీదేవి, గణపతిని పూజిస్తారు. లక్ష్మి, గణపతి విగ్రహాలను అందంగా పువ్వులతో అలంకరించి వాటి ముందు ప్రమిదలతో దీపం పెడితే.. ఇల్లు లక్ష్మి కళతో నిండుగా అందంగా కనిపిస్తుంది.

4 / 6
పండగ పర్వదినాన మరింత శోభాయమానంగా కనిపించాలంటే.. రంగురంగుల పూలు, దీపాలు, రంగుల బల్బులు, ప్రముఖ పాత్రని పోషిస్తాయి.

5 / 6
ఇక దీపావళి రోజున దేవుడిగదిలోనే కాదు.. ఇంటి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. ఇక ఇంటి పైకప్పునుంచి ఎలక్ట్రిక్ లైట్లు తోరణాలు వెళ్లదీస్తే మరింత అందంగా కనిపిస్తుంది. సాంప్రదాయ ప్రమిదలతో పాటు.. మధ్యలో విభిన్నంగా వుండేలా మంచి వాసననిచ్చే రంగు రంగుల కేండిల్స్ పెట్టండి.

6 / 6
Follow us