TRS Plenary: 9వ సారీ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక.. ప్లీనరీని Live లో వీక్షించండి
TRS Plenary: తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే సీఎం..

TRS Plenary: తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే సీఎం కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకుని పార్టీ జెండా ఎగువేశారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ నేపథ్యంలో హైటెక్స్ పరిసర ప్రాంతాలు గులాబీ మయమయ్యాయి. ఈ ప్లీనరీకి టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టీఆర్‌ఎస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 9వ సారీ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నికయ్యారు.
ఈ టీఆర్‌ఎస్ ప్లీనరీకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ప్రతినిధులతో పాటు మొత్తం 6 వేల మంది వరకు తరలివచ్చారు. పార్లమెంట్ సమావేశాలు, కరోనా కారణంగా మూడేళ్ల పాటు ప్లీనరీ సమావేశాలు జరగలేదు. దీంతో ఈ సారి గులాబీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక ఈ సమావేశాల్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఈసారి కూడా కేసీఆర్‌ను పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం లాంఛనం కానుంది.
టీఆర్‌ఎస్ ప్లీనరీ కార్యక్రమాన్ని Liveలో వీక్షించండి