Encounter: మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్.. ముగ్గురి మృతి!
Encounter: మావోయిస్టులకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా పోలీసులు చేపడుతున్న చర్యలతో ఎదురుదెబ్బ తలగులుతోంది...
Encounter: మావోయిస్టులకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా పోలీసులు చేపడుతున్న చర్యలతో ఎదురుదెబ్బ తలగులుతోంది. తాజాగా తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో ఏకే-47, ఇతర రైఫిల్స్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మృతుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత ఉన్నట్లు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్ బీజాపూర్ జిల్లా తర్లగూడ ఈటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది.
కాగా, ఇటీవల మావోయిస్టు అగ్రనేత ఆర్క్ అనారోగ్యంతో మృతితో పార్టీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆర్క్ కోల్పోవడం పార్టీకి తీరని లోటు మిగిలిపోయింది. ఇటీవల కాలంలో తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టులు కదలికలు ఎక్కువ కావడంతో పోలీసు ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. అప్పటి నుంచి వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో మావయిస్టుల కదలికలు మరింతగా ఎక్కువ కావడంతో వారిని ఏరివేతలో భాగంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.