Family Suicide: విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య.. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్.. అందులో ఏముందంటే..
Family Suicide: సాఫిగా సాగిపోయే కొన్ని జీవితాలు విషాదంగా మారుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఇతర కారణాలతో కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలకు..
Family Suicide: సాఫిగా సాగిపోయే కొన్ని జీవితాలు విషాదంగా మారుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఇతర కారణాలతో కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నాయి. కుటుంబ పెద్ద ఆత్మహత్యకు పాల్పడితే కొన్ని కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. కుటుంబంలో భార్య చనిపోయిన, భర్త చనిపోయిన కుటుంబం తీవ్ర విషాదానికి లోనవుతుంటుంది. కొన్ని కొన్ని కుటుంబాలే ఆత్మహత్యలకు ఒడిగడుతుంటాయి. కారణాలు ఏవైనా.. వారు చేసిన పనిని చూసి కంటతడి పెట్టించేలా ఉంటుంది.
ఇలాంటి విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. రాష్ట్రంలోని బెళగావి జిల్లా హుక్కేరి సమీపంలోని బొర్గాల్ గ్రామంలో తండ్రి సహా నలుగురు పిల్లలు విగతజీవులుగా కనిపించారు. గత ఏడాది బ్లాక్ ఫంగస్‌తో భార్య జయక్క మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. భార్య మరణించిన నాటి నుంచి భర్తతో పాటు పిల్లలు కూడా తీవ్రమైన విషాదంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఐదుగురు కుటుంబ సభ్యులు విషం తాగి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు.
ఘటనా స్థలంలో సూసైడ్ నోట్..
ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బ్లాక్ ఫంగస్‌తో భార్య చనిపోవడంతో తాను తీవ్రంగా కుమిలిపోతున్నామని భర్త హదిమిణి సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతులు మాజీ ఆర్మీ ఉద్యోగి గోపాల్ దొడ్డప్ప హదిమణి (47), పిల్లలు సౌమ్య (20), స్వాతి (17), సాక్షి (13), సృజన్ (10)గా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. తండ్రి తన పిల్లలకు విషం కలిపిన ఆహారాన్ని తినిపించి, ఆ తర్వాత తాను విషం తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే అంత్యక్రియలో కోసం తాను రూ.20 వేలు పక్కన పెట్టానని, పోలీసుల సహాయంతో వాటిని నిర్వహించాల్సిందిగా ఇరుగుపొరుగు వారిని కోరినట్లు సూసైడ్ నోట్‌లో హదిమణి పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.