Paritala: అనంతపురం జిల్లా నుంచి బ్రేకింగ్‌ న్యూస్‌.. ధర్మవరంలో టెన్షన్ టెన్షన్‌.. రంగంలోకి పరిటాల

అనంతపురం జిల్లా నుంచి ఈ బ్రేకింగ్‌ న్యూస్‌. ధర్మవరంలో టెన్షన్ టెన్షన్‌.. కూరగాయల మార్కెట్ లో దుకాణాల తొలగింపుపై వివాదం నెలకొంది.

Paritala: అనంతపురం జిల్లా నుంచి బ్రేకింగ్‌ న్యూస్‌..  ధర్మవరంలో టెన్షన్ టెన్షన్‌.. రంగంలోకి పరిటాల
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 24, 2021 | 9:14 AM

Dharmavaram Tension: అనంతపురం జిల్లా నుంచి ఈ బ్రేకింగ్‌ న్యూస్‌. ధర్మవరంలో టెన్షన్ టెన్షన్‌.. కూరగాయల మార్కెట్ లో దుకాణాల తొలగింపుపై వివాదం నెలకొంది. కొత్త మార్కెట్‌లో దుకాణాల కోసం పది లక్షల రూపాయలు డిపాజిట్‌ చేయాలని మున్సిపల్‌ అధికారులు కోరారు. ఈమేరకు వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. దీంతో కొంతమంది డిపాజిట్‌ చేయలేదు. మరికొందరు దుకాణాలు ఖాళీ చేయలేదు. ఒక్కసారిగా ఇవాళ 40 దుకాణాలను కూల్చివేసేందుకు మున్సిపల్‌ అధికారులు వచ్చారు. దుకాణాలు కూల్చి వేత చేపట్టారు. దుకాణాల తొలగింపును ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, వామపక్షాలు అడ్డుకున్నాయి. వారిని అరెస్టు చేసి దుకాణాల తొలగింపును చేపట్టారు అధికారులు. దీనిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పరిటాల శ్రీరామ్. ఈ అంశంమీద తమ ఆందోళన ఉధృతం చేస్తామని శ్రీరామ్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

కాగా, ధర్మవరం పట్టణం నడిబొడ్డున ఉన్న కూరగాయల మార్కెట్లో దుకాణాలపై కూల్చివేత పై గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. ఈ స్థలాన్ని అభివృద్ధి చేయడంతో పాటు కొత్త మార్కెట్‌ సముదాయం కోసం పురపాలక ప్రణాళిక చేసింది. ఇందుకు ఒక్కో దుకాణదారుడు 10 లక్షలు డిపాజిట్‌ చేయాలని వ్యాపారులకు నోటీసులు చేసింది. అయితే దీనిని వ్యతిరేకిస్తూ గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. దీనిపై ఇప్పటికే పరిటాల శ్రీరాంతో పాటు వామపక్ష నేతలు ఆందోళనలు నిర్వహించారు. కానీ ఇవాళ తెల్లవారుజామున భారీ పోలీస్ ఫోర్స్ మధ్య దుకాణాలు తొలగింపు చేపట్టారు. అయితే దీనిని అడ్డుకునేందుకు టీడీపీ, జనసేన, వామపక్ష నేతలు ప్రయత్నించారు. వారి బలవంతంగా అరెస్టుచేసి దుకాణాలను తొలగించారు. ఈ సంఘటన ధర్మవరంలో టెన్షన్ వాతావరణాన్ని సృష్టించింది.

Read also: Lovers: తమ ప్రేమను అంగీకరించడంలేదని నల్గొండ జిల్లాలో ప్రేమికులు తీసుకున్న స్టెప్..