- Telugu News Photo Gallery Science photos NASA chief Bil Nelson expressed positive doubt about the Aliens and life on another planets
NASA about Aliens: గ్రహాంతరజీవుల ఉనికి ఉండవచ్చు.. నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానం!
గ్రహాంతర వాసులు ఉన్నాయా లేవా అనేది ఎప్పటి నుంచో నలుగుతున్న మిలియన్ డాలర్స్ ప్రశ్న. నాసా అధినేత బిల్ నెల్సన్ ఈ విషయంపై వస్తున్న వాదనలు కొట్టిపాడేయ లేదు. అలా అని పూర్తిగా ఖండించలేదు. విశ్వంలో మరో చోట జీవరాశి ఉండొచ్చని నమ్ముతున్నట్టు మాత్రం ఆయన స్పష్టం చేశారు.
Updated on: Oct 26, 2021 | 9:52 AM

విశ్వంలో మనం ఒంటరిగా లేమని నాసా అధిపతి బిల్ నెల్సన్ అంటున్నారు. గ్రహాంతర జీవుల ఉనికి గురించి ఆయన ఒక ప్రకటన చేశారు. మేలో నాసా (NASA) అధిపతిగా నియమితులైన బిల్ నెల్సన్ ఒక ఇంటర్వ్యూలో గ్రహాంతర జీవుల ఉనికి గురించి మాట్లాడారు. విశ్వం చాలా పెద్దదని, ఇప్పుడు మరిన్ని విశ్వాలు ఉంటాయని తెలిసిందన్నారు. ఇది ఇలా ఉంటే, భూమి మాత్రమే జీవం ఉన్న ప్రదేశం అని చెప్పడానికి నేను ఎవరు అని ప్రశ్నించారు.

భూమి వంటి ఇతర గ్రహాలు ఉన్నాయా? అనే ప్రశ్నకు బిల్ నెల్సన్ విశ్వం చాలా పెద్దది కాబట్టి ఇది పూర్తిగా నిజమని నేను భావిస్తున్నాను అని చెప్పారు. అంగారకుడిపైకి వెళ్తున్నామనీ అక్కడ జీవితాన్ని కనుగొనడమే మా లక్ష్యం అనీ పేర్కొన్నారు. మరో గ్రహంపై జీవం కోసం వెతకడం కూడా నాసా మిషన్‌లో భాగమే. 2004 నుండి, నేవీ పైలట్లు 400 కంటే ఎక్కువ యూఎఫ్ వో(UFO)లను చూశారని ఆయన అన్నారు. నెల్సన్ కూడా 1986లో అంతరిక్షంలోకి వెళ్ళారు.

ఈ విషయాలు ఏమిటో ఇప్పటి వరకు పైలట్‌లకు తెలియదని నాసా చీఫ్ అన్నారు. ఈ విషయం ఏమిటో మాకు కూడా తెలియదు. ఆధునిక సాంకేతికతను కలిగి ఉన్న భూమికి ఇది శత్రువు కాదని మనం ఆశించవచ్చు అని ఆయన చెప్పారు. అయితే ఇది కొంత వరకూ నిజమే అనిపిస్తుంది. మేము ఈ దిశలో మిషన్‌ను పంపడానికి కారణం ఇదే. తద్వారా అది ఏమిటో కనుగొనబడుతుందని ఆశిద్దాం.

యూఎఫ్ వో(UFO)లు, గ్రహాంతరవాసుల ఉనికిని కూడా ఆయన నమ్ముతున్నాడని బిల్ నెల్సన్ మాటలను బట్టి స్పష్టమైంది. భూమికి మించి జీవం విలసిల్లుతుందని, అందుకే నాసా ఇప్పుడు దానిని కనిపెట్టె ప్రయత్నాలు మొదలు పెట్టిందని నమ్ముతున్నారు. అదే సమయంలో, నెల్సన్ విశ్వంలో ఎక్కడైనా జీవం ఉంటే, మన గ్రహాన్ని మనం బాగా చూసుకోవాల్సిన సమయం ఆసన్నమైందాని చెబుతున్నారు.

ఇటీవలి సంవత్సరాలలో, యూఎఫ్ వో(UFO)లతో పైలట్‌ల ఎన్‌కౌంటర్ గురించి యూఎస్ ప్రభుత్వం తెలుసుకున్నది. అయితే, ఆకాశంలో ఎగురుతున్న ఈ వస్తువులు గ్రహాంతరవాసుల నౌకలు అని ఎప్పుడూ చెప్పలేదు. జూన్‌లో విడుదలైన UFOలు, గ్రహాంతరవాసులపై పెంటగాన్ నివేదిక ఆకాశంలో ఎగురుతున్న విషయాలు ఏమిటో నిర్ధారణకు రాలేకపోవడానికి ఇదే కారణం.





























