- Telugu News Photo Gallery Science photos Immortal Jelley Fish that can lives for ever No death for this sea animal
Immortal Jelley Fish: నిజంగా ఈ జీవికి మరణం లేదు.. జీవితం మీద విరక్తి కలిగే వరకూ బతికే అవకాశం ఉన్న ఏకైక జీవి ఇదే!
చనిపోతే మళ్ళీ ఏ జీవీ తిరిగి బ్రతకలేదు. ఇది ప్రకృతి ధర్మం. అయితే, తాను కావాలనుకుంటేనే చనిపోగల జీవి ఒకటి ఉంది. తనకు వృద్ధాప్యం వచ్చినా.. తిరిగి చిన్నపిల్లలా మరిపోగలదు ఆ జీవి.
Updated on: Oct 25, 2021 | 11:31 AM

ఈ జీవి మరణించిన తరువాత మళ్ళీ పుట్టగలదు. సింపుల్ గా చెప్పాలంటే దీనికి మరణం లేదు. మీరు అది విని ఇది కల్పితం అనుకున్నారా? కానీ కాదు. ఇమ్మోర్టల్ జెల్లీ ఫిష్ జెల్లీ ఫిష్ జాతికి చెందినది. ఈ జెల్లీఫిష్‌కు మరణాన్ని తట్టుకునే సామర్థ్యం ఉంది. ఈ జెల్లీ ఫిష్ కు తన మరణాన్ని ఎలా నివారించాలో తెలుసు ...

ఈ జెల్లీ ఫిష్ శాస్త్రీయ నామం 'ట్యూరిటోప్సిస్ డోహ్ర్నీ'. ఈ జాతి జెల్లీ ఫిష్ పోషకాహార లోపం లేదా వృద్ధాప్యం కారణంగా చనిపోతుందని తాను భావిస్తే మళ్ళీ చిన్న పిల్లగా మారిపోతుంది. ఇలా తన వృద్ధాప్యాన్ని తెలుసుకుని పిల్లగా మరిపోవడాన్ని సెల్యులార్ ట్రాన్స్‌డిఫర్న్‌టియేషన్ అంటారు.

ఈ జీవి పరిపక్వ కణాలను అంటే చివరి దశకు వచ్చేసి జీవం కోల్పోతున్న కణాలను అపరిపక్వ కణాలుగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. అందువల్ల ఇది తనలో చనిపోతున్న కణాలను కొత్త కణాలుగా మర్చేసుకుంటుంది. అందువల్ల ఇది మళ్ళీ చిన్న పిల్లలా మారిపోతుంది.

ఈ జీవి ఇలా ఎన్ని సార్లు కావాలన్నా మళ్లీ మళ్లీ చిన్నపిల్ల కావచ్చు! కానీ అవి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ పద్ధతిని ఉపయోగిస్తాయి. లేదా, సాధారణ జెల్లీ ఫిష్‌ల మాదిరిగా, అవి కొన్ని నెలలు లేదా సంవత్సరాలలో చనిపోతాయి. అంటే ఈ జీవులు తాము ఇంకా జీవించాలి అనుకుంటే జీవించగలవు.. ఈ లైఫ్ బోర్ కొట్టేసింది అనుకుంటే తమకున్న శక్తిని వినియోగించుకోకుండా మరణించగలవు.

ఈ గంట ఆకారపు జెల్లీ ఫిష్ గరిష్ట వ్యాసం 4.5 మిమీ మాత్రమే. 1883లో మధ్యధరా సముద్రంలో చనిపోయిన జెల్లీ ఫిష్‌లను శాస్త్రవేత్తలు తొలిసారిగా కనుగొన్నారు. అయితే, 1990లలో కొంతమంది ఇటాలియన్ పరిశోధకులు మరణాన్ని తట్టుకునే వీటి ప్రత్యేక సామర్థ్యాన్ని కనుగొన్నారు. అమరత్వం ఉన్నప్పటికీ, అవి తరచుగా పెద్ద జాతులకు చిక్కి ప్రాణాలు కోల్పోతాయి. ఏదేమైనా, ఈ ప్రత్యేక సామర్థ్యం కారణంగా, చనిపోయిన జెల్లీఫిష్ ప్రపంచంలోని అన్ని మహాసముద్రాలలో విస్తరిస్తున్నట్లు నివేదికలు ఉన్నాయి.





























