Huzurabad Election: క్లైమాక్స్‌కి చేరిన హుజూరాబాద్ వార్.. ఈటల గెలుపు ఖాయం.. మెజార్టీ ఎంతో తేలాలన్న కిషన్ రెడ్డి
హుజురాబాద్ బైపోల్స్ వార్ క్లైమాక్స్‌కి వచ్చేసింది. ప్రచారం పీక్స్‌లో జరుగుతోంది. క్యాంపైనింగ్‌కి ఇంకా రెండ్రోజులే ఉండటంంతో హోరాహోరీగా తలపడుతున్నారు.
Huzurabad By Election: హుజురాబాద్ బైపోల్స్ వార్ క్లైమాక్స్‌కి వచ్చేసింది. ప్రచారం పీక్స్‌లో జరుగుతోంది. క్యాంపైనింగ్‌కి ఇంకా రెండ్రోజులే ఉండటంంతో హోరాహోరీగా తలపడుతున్నారు. రేపు(బుధవారం) సాయంత్రంతో అక్కడ బైపోల్ ప్రచారం ముగియనుంది. ప్రచారం ఇప్పటివరకు చేసింది ఒక ఎత్తు… ఈ రెండ్రోజులు మరో ఎత్తు అన్నట్టుగా అగ్రనేతలంతా రంగంలోకి దిగుతున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లకు ఊపిరాడనివ్వకుండా ప్రచారం చేస్తున్నారు. దాదాపు ఐదు నెలలుగా హుజురాబాద్‌లో బీజేపీ, టీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలూ ప్రతి ఓటరును కనీసం రెండుమూడుసార్లు కలిసుంటారని అంచనా. ఇక ఈ రెండ్రోజుల్లో ప్రతి ఓటరును కనీసం ఒక్కసారైనా కలవాలన్న టార్గెట్‌తో దూసుకుపోతున్నారు.
బీజేపీ, టీఆర్ఎస్‌లు ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్నాయి. పార్టీ అభ్యర్థిని గెల్లును గెలిపించుకునేందుకు మంత్రి హరీశ్ రావు అన్నీ తానై సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఓ రకంగా హుజూరాబాద్ బైపోల్ పోరు బీజేపీ-టీఆర్ఎస్ మధ్య జరుగుతున్న పోరు కాదు..సీఎం కేసీఆర్-మాజీ మంత్రి ఈటల రాజేందర్ మధ్య జరుగుతున్న పోరుగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితాలు తెలంగాణ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని అంచనావేస్తున్నారు.
అక్టోబర్ 30న హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ రెండున కౌంటింగ్ జరుగుతుంది. తెలంగాణలో ఫస్ట్ టైమ్ ఒక ఉపఎన్నిక కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగిస్తున్నారు. ప్రతి 83మంది ఓటర్లకు ఒక సీఆర్పీఎఫ్ జవాన్ ఉంటాడు.
హుజురాబాద్‌లో మొత్తం 2,36,430మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 1,17,552 మంది ఉంటే, మహిళా ఓటర్లు 1, 18, 716మంది ఉన్నారు. అయితే, కొత్తగా నమోదైన ఓటర్లు 10వేల మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఎన్నారై ఓటర్లు – 14మంది, సర్వీస్ ఓటర్లు – 147మంది, ట్రాన్స్‌జెండర్ – ఒకరు ఉన్నారు.
హుజురాబాద్ బైపోల్స్ కీలక అంశాలు.. అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న కౌంటింగ్ మొత్తం ఓటర్లు – 2,36, 430మంది పురుషులు – 1,17,552 మంది మహిళలు – 1,18, 716మంది కొత్తగా నమోదైన ఓటర్లు – 10వేల మంది ఎన్నారై ఓటర్లు – 14 సర్వీస్ ఓటర్లు – 147 ట్రాన్స్‌జెండర్ – 1 పోస్టల్ బ్యాలెట్ – 822మంది పోలింగ్ కేంద్రాలు – 305
బీజేపీ గెలుపు ఖాయం.. తేలాల్సింది మెజార్టీయే: కిషన్ రెడ్డి
హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. బీజేపీకి మెజార్టీ ఎంత అన్నదే తేలాల్సి ఉందని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
Also Read..
Huzurabad: హుజూరాబాద్, బద్వేల్ బైపోల్స్‌లో వారిదే విజయం.. పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు
Jio Phone Next: ప్రగతి ఓఎస్ తో జియోఫోన్ నెక్స్ట్.. జియో విడుదల చేసిన సరికొత్త ఫీచర్లు ఇవే!