Drinking Water: నిలబడి నీళ్లు తాగుతున్నారా..! ఈ విషయం తెలిస్తే ఈ సాహసం అస్సలు చేయరు..
Drinking Water: నీరు శరీరానికి ఎంత అవసరమో అందరికి తెలుసు. ఆహారం లేకపోయినా సరే కానీ నీరు లేకపోతే ఎవ్వరూ బతకలేరు. అందుకే రోజు ఎన్ని
Drinking Water: నీరు శరీరానికి ఎంత అవసరమో అందరికి తెలుసు. ఆహారం లేకపోయినా సరే కానీ నీరు లేకపోతే ఎవ్వరూ బతకలేరు. అందుకే రోజు ఎన్ని లీటర్ల నీరు తాగుతున్నారో చెక్ చేసుకోవాలి. అంతేకాదు నీరు ఏ పద్దతిలో తాగుతున్నారనేది కూడా చాలా ముఖ్యం. చాలామంది వాటర్ నిలబడి తాగుతారు. అయితే ఇది మంచి పద్దతి కాదు. నీటిని ఎప్పుడైనా సరే ప్రశాంతంగా కూర్చొని తాగాలి. నిలబడి నీళ్లు తాగితే ఏం జరుగుతుందో ఒక్కసారి తెలుసుకుందాం.
1. అజీర్ణం నిలబడి నీళ్ళు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ఎఫెక్ట్ పడుతుంది. తాగిన నీళ్లు వేగంగా వెళ్లి పొత్తికడుపుపై ప్రభావం చూపుతాయి. ఇది చాలా ప్రమాదకరం. ఇలా చేయడం వల్ల ద్రవాల సమతుల్యత దెబ్బతింటుంది. దీని వల్ల టాక్సిన్స్ పెరుగుతాయి.
2. ఆర్థరైటిస్ నిలబడి నీళ్లు తాగినప్పుడు నరాలు ఉద్రిక్తత స్థితిలో ఉంటాయి. ఇది ద్రవాల సమతుల్యతను దెబ్బతీస్తుంది. శరీరంలో విషపదార్ధాలు, అజీర్ణాన్ని పెంచుతుంది. ఇలా చేయడం వల్ల ఆర్థరైటిస్ వస్తుంది. ఎందుకంటే నిలబడి నీరు తాగడం వల్ల కీళ్ళలో ద్రవాలు పేరుకుపోతాయి. తద్వారా ఆర్థరైటిస్ సమస్యలు, కీళ్ల నొప్పులు వస్తాయి.
3. ఊపిరితిత్తులకు ప్రమాదం నిలబడి నీటిని తాగినప్పుడు అవసరమైన పోషకాలు, విటమిన్లు కాలేయం, జీర్ణవ్యవస్థకు చేరవు. మీరు నిలబడి నీరు తాగినప్పుడు అవి శరీరంలోకి వేగంగా వెళుతాయి. దీనివల్ల ఆక్సిజన్ స్థాయి చెదిరిపోతుంది. కాబట్టి ఊపిరితిత్తులు గుండె పనితీరును ప్రమాదంలో పడేస్తుంది.
4. కిడ్నీ సమస్యలు కూర్చున్నప్పుడు మన కిడ్నీలు బాగా ఫిల్టర్ అవుతాయని చాలా నివేదికలలో తేలింది. నిలబడి నీరు తాగినప్పుడు నీరు దిగువ పొట్టకు ఎలాంటి వడపోత లేకుండా వెళుతాయి. దీని వల్ల మూత్రాశయంలో నీటి మలినాలు చేరి మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. మూత్ర నాళాల రుగ్మతలను కలిగిస్తుంది.
5. నీరు తాగడానికి సరైన మార్గం.. నీరు తాగడానికి సరైన మార్గం ఏంటంటే కుర్చీపై కూర్చుని, వెన్న భాగాన్ని నిటారుగా ఉంచి నీళ్లు తాగాలి. ఇలా తాగడం వల్ల పోషకాలు మెదడుకు చేరుకుంటాయి. మెదడు తన పనితీరును మెరుగుపరుచుకుంటుంది. ఇది మాత్రమే కాదు జీర్ణక్రియ బాగవుతుంది.