Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బొప్పాయి ఆకుల రసంతో డెంగ్యూ ఫీవర్‏కు చెక్ పెట్టొచ్చా ? .. అధ్యాయనాలు ఏం చెబుతున్నాయంటే..

కరోనా మహమ్మారి కేసులు కాస్త తగ్గాయని ఊపిరి పీల్చుకునేలోపే డెంగ్యూ జ్వరాలు ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి.

బొప్పాయి ఆకుల రసంతో డెంగ్యూ ఫీవర్‏కు చెక్ పెట్టొచ్చా ? .. అధ్యాయనాలు ఏం చెబుతున్నాయంటే..
Papaya Leaf Juice
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 26, 2021 | 1:29 PM

కరోనా మహమ్మారి కేసులు కాస్త తగ్గాయని ఊపిరి పీల్చుకునేలోపే డెంగ్యూ జ్వరాలు ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. డెంగ్యూ భారీన పడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు డెంగ్యూ జ్వరంతో పోరాడుతున్నారు. ఈ జ్వరాన్ని తగ్గించడానికి ఇంటి నివారణలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. డెంగ్యూ జ్వరం వలన రోగి రక్తంలో ప్లేట్ లెట్స్ పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

అయితే బొప్పాయి ఆకు రసం ప్లేట్ లెట్స్ తగ్గుదలను నియంత్రిస్తుంది. అలాగే రక్తంలో ప్లేట్ లేట్స్ పెంచడానికి కూడా ఈ ఆకుల రసం ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ చికిత్స ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా చేస్తున్నారు. ప్రముఖ వెబ్సైట్ నివేదిక ప్రకారం బొప్పాయి ఆకుల రసంలో ఎక్స్‌ట్రాక్ట్‌లో పపైన్, చైమోపాపైన్, సిస్టాటిన్, ఎల్-టోకోఫెరోల్, ఆస్కార్బిక్ యాసిడ్. ), ఫ్లేవనాయిడ్స్, సైనోజెనిక్ గ్లూకోసైడ్‌లు మరియు గ్లూకోసినోలేట్‌లు ఉంటాయి. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్లు. ఇవన్నీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బొప్పాయి ఆకు రసం గురించి జంతువులపై చేసిన అధ్యయనాలు సానుకూల ఫలితాలను కనుగొన్నాయి. ఈ జ్యూస్ ఇవ్వడం వలన జంతువుల ఆరోగ్యం మెరుగుపడింది. ప్లేట్ లెట్స్, ఎర్ర రక్తకణాల సంఖ్య కూడా పెరిగింది. మలేషియాలో కూడా ట్రయల్స్ నిర్వహించబడ్డాయి. ఫలితంగా బొప్పాయి జ్యూస్‌ ఇచ్చిన 40 నుంచి 48 గంటల తర్వాత ప్లేట్‌లెట్స్‌లో పెరుగుదల నమోదైంది. ఇలాంటి ఇతర పరీక్షలలో, ప్లేట్‌లెట్‌లను పెంచడం గురించి చర్చ జరిగింది. అయితే దీనిపై వైద్యశాస్త్రంలో ఎలాంటి పరిశోదనలు జరగలేదు. డెంగ్యూ ఒక వ్యాధి. ఇది ఔషధాలతో నయం కాదు.. శరీరమే నియంత్రిస్తుంది. జ్వరం తగ్గిన తర్వాత ప్లేట్ లెట్స్ పెరుగుతాయి. ఇప్పటివరకు, ఈ పరిశోధనలు బొప్పాయి రసం గురించి సైన్స్‌లో ఖచ్చితమైన అధ్యయనాలు లేవని చూపిస్తున్నాయి. బొప్పాయి సహజమైన ఉత్పత్తి. దీనినిమ మూలికా ఉత్పత్తి అని పిలుస్తారు. అయితే బొప్పాయి ఆకు రసం వలన డెంగ్యూ జ్వరానికి చెక్ పెట్టొచ్చు అనడానికి వైద్య శాస్త్రంలో ఎలాంటి ఆధారాలు లేవు.

Also Read: