Subhash Goud |
Updated on: Oct 26, 2021 | 1:45 PM
Bajaj Auto Dominar 400: ప్రస్తుతం రకరకాల బైక్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ఇక తాజాగా బజాజ్ ఆటో డామినార్ 400 బైకును మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.2.16 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
సుదీర్ఘ దూరాలకు దీర్ఘకాలం ప్రయాణించే రైడర్ల కోసం ఈ బైకులో ఫ్యాక్టరీ- ఫిట్టెడ్ టూరింగ్ విడిభాగాలను అమర్చారు. ఇందులో అమర్చిన 373.3 సీసీ ఇంజిన్ 40 పీఎస్ శక్తిని అందిస్తుంది.
ప్రీమియం బైకులో డామినార్ 400 ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే నగర కస్టమర్లతో పాటు ఎక్కువ దూరం చేసే ప్రయాణాలు చేసే ప్రయోజనకరంగా ఉంటుంది. అందులో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించి రైడర్లకు మంచి అనుభూతి కలిగించేలా రూపొందించారు.
వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మరిన్ని మార్పులు చేసి కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు బజాజ్ ఆటో హెడ్ (మార్కెటింగ్) నారాయణన్ సుందరరామన్ వెల్లడించారు. కస్టమర్లను ఆకర్షించేలా ఉంటుందని పేర్కొన్నారు.