- Telugu News Photo Gallery Business photos Best Data Plans: here is the list of best data plans from airtel Reliance jio vodafone idea which offers more daily data
Best Data Plans: మీకు రోజు డేటా సరిపోవడం లేదా..? ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్..!
Best Data Plans: వినియోగదారులను ఆకర్షించడానికి టెలికాం కంపెనీలు పోటీలు పడి మరీ ఆఫర్లు అందిస్తున్నాయి. మీరు ప్రతిరోజూ డేటా విషయంలో ఇబ్బంది లేకుండా మరియు..
Updated on: Oct 25, 2021 | 1:51 PM

Best Data Plans: వినియోగదారులను ఆకర్షించడానికి టెలికాం కంపెనీలు పోటీలు పడి మరీ ఆఫర్లు అందిస్తున్నాయి. మీరు ప్రతిరోజూ డేటా విషయంలో ఇబ్బంది లేకుండా మరియు అనేక ప్రయోజనాలు ఉన్న ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి.

వొడాఫోన్ ఐడియా రూ.449 ప్లాన్: వోడాఫోన్ ఐడియా రూ. 449 ప్లాన్‌లో ప్రతిరోజూ 4GB డేటా అంటే మొత్తం 224 జీబీ డేటా, జీ 5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, మధ్యాహ్నం 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఉచిత డేటా కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 56 రోజులు. Vi మూవీస్ మరియు టీవీ యాప్‌కు సబ్‌స్క్రిప్షన్ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది.

ఎయిర్‌టెల్ రూ.448 ప్లాన్: ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 3GB హై-స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. డిస్నీ + హాట్‌స్టార్ VIP, ప్రైమ్ వీడియో మొబైల్ సబ్‌స్క్రిప్షన్ 1 సంవత్సరం పాటు ఉచితం.

జియో రూ.447 ప్లాన్: ఈ ప్లాన్‌లో 50GB డేటా, లభిస్తుంది. పరిమిత వాయిస్ కాలింగ్, రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు, వ్యాలిడిటీ 60 రోజులు. ఈ ప్లాన్ జియో యాప్స్ జియోటివి, జియోసినిమా, జియోన్యూస్, జియోసెక్యూరిటీ మరియు జియోక్లౌడ్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.

జియో రూ.349 ప్లాన్: ఈ ప్లాన్‌లో, అపరిమిత కాల్స్, రోజు 3జీబీ డేటా, రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు, జియో యాప్‌లకు పూర్తి సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఇలా డేటా కోసం ఈ ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి టెలికాం కంపెనీలు.





























